త్రివిక్రమ్ ఎన్టీఆర్ మూవీ పాన్ ఇండియా కాదు

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కుతుంది.

ఇందులో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు.అలాగే బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

NTR And Trivikram Movie Family Entertainer, Jr NTR, RRR Movie, Rajamouli, Pan In

భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో ఈ సినిమాని జక్కన్న తెరకెక్కిస్తున్నాడు.హాలీవుడ్ స్టార్స్ కూడా ఇందులో నటిస్తున్నాడు.

ఎన్టీఆర్ కి `జోడీగా రాజమౌళి హాలీవుడ్ హీరోయిన్ ని రంగంలోకి దించాడు.దేశ దేశవ్యాప్తంగా ఈ సినిమా మీదా క్రేజ్ ఉంది.

Advertisement

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత తారక్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.ఇప్పటికే ఈ సినిమా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యింది.

ఇక ఈ సినిమాని పొలిటికల్ నేపధ్యంలో త్రివిక్రమ్ ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యాడని టాక్ వినిపించింది.సినిమాకి టైటిల్ గా అయినా పోయిరావలె హస్తినకి అనేది కన్ఫర్మ్ చేసినట్లు ప్రచారం జరిగింది.

అలాగే ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతుందని వినిపించింది.అయితే తాజాగా ఈ సినిమా గురించి ఫిలిం నగర్ సర్కిల్ లో మరో న్యూస్ వినిపిస్తుంది.

తారక్ కోసం త్రివిక్రమ్ పొలిటికల్ స్టొరీ రాయడం లేదని, ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథని సిద్ధం చేశాడని వినిపిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యిందని, తారక్ కి కూడా నచ్చిందని తెలుస్తుంది.

టూత్ పేస్ట్ పళ్లకే కాదు.. ఇలా కూడా వాడొచ్చు!!

కుటుంబ బంధాల నేపధ్యంలోనే కంప్లీట్ గా కథ ఉంటుందని, తారక్ సూచన మేరకు త్రివిక్రమ్ ఈ జోనర్ లో కథని సిద్ధం చేశాడని టాక్.ఇక సినిమా కూడా కేవలం సౌత్ భాషలకే పరిమితం అని తెలుస్తుంది.

Advertisement

మరి ఫైనల్ గా ఈ సినిమా ఎ జోనర్ లో వస్తుందో అనేది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యేంత వరకు వేచి చూడాలి.

తాజా వార్తలు