యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దేవర”( Devara ).ఈయనకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని కొరటాల కూడా భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
అన్ని ఎలిమెంట్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు.
ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ ను ఈ సినిమాలో ఎక్కువుగా భాగం చేస్తూ ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు.ప్రజెంట్ ఎన్టీఆర్( Junior NTR ) నటిస్తున్న దేవర సినిమా శరవేగంగా పూర్తి చేస్తున్నారు.అయితే ఇటీవలే గోవా షెడ్యూల్ ముగియడం అందులోను దీపావళి సందర్భంగా చిన్న బ్రేక్ తీసుకున్నారు.
మరి ఈ బ్రేక్ ఇప్పుడు పూర్తి అయినట్టు మేకర్స్ తాజాగా తెలిపారు.అఫిషియల్ గా షూట్ గురించి అప్డేట్ ఇస్తూ మేకర్స్ నెక్స్ట్ షెడ్యూల్ గురించి తెలిపారు.దీపావళి సందర్భంగా బ్రేక్ తీసుకున్నాం.ఇక ఇప్పుడు మా హార్డ్ వర్క్ టీమ్ నెక్స్ట్ ఎపిక్ షెడ్యూల్ కోసం వచ్చిందని చెప్పుకొచ్చారు.ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఇప్పుడు ఖుషీగా ఉన్నారు.మొత్తం మీద షూట్ అయితే చివరికి వచ్చినట్టే అనిపిస్తుంది.
కాగా ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.