ఎన్టీఆర్‌ 30 మొదటి షెడ్యూల్‌ లో చిత్రీకరించేది ఏంటీ?

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ 30వ సినిమా వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది.దాదాపు ఏడాది కాలంగా అభిమానులు ఈ సినిమా ప్రారంభం కోసం వెయిట్‌ చేస్తున్నారు.

దర్శకుడు కొరటాల శివ అదుగో ఇదుగో అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చాడు.ఎట్టకేలకు ఈ సినిమా ప్రారంభం అవుతుంది అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది.

కొత్త సంవత్సరం సందర్భంగా సినిమాను ఫిబ్రవరి నెలలో ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ నటించబోతున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని అంతా భావిస్తున్నారు.దర్శకుడు కొరటాల శివ ఆచార్య మినహా అంతకు ముందు సినిమాలన్నీ కూడా భారీగా విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

Advertisement
Ntr 30 Movie First Schedule Shooting Update , Ntr 30 Movie , First Schedule ,

కనుక ఎన్టీఆర్‌ 30 ఆరంభం ఎలా ఉంటుంది.మొదటి సన్నివేశాన్ని ఎలా చేయబోతున్నారు అనేది అందరి దృష్టిలో ఉంది.

విశ్వసనీయంగా మాకు అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెల ఆరంభంలో హైదరాబాద్‌ శివారులో వేసిన ప్రత్యేక సెట్‌ లో ఎన్టీఆర్‌ పై కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు.అందుకు సంబంధించిన ముందస్తు ప్రణాళికలు సిద్దం అయ్యాయి.

మొదటి షెడ్యూల్‌ ను దాదాపుగా రెండు వారాల పాటు నిర్వహించాలని భావిస్తున్నారు.

Ntr 30 Movie First Schedule Shooting Update , Ntr 30 Movie , First Schedule ,

అనుకున్న సన్నివేశాలను ముందుగానే ముగించే అవకాశాలు కూడా లేక పోలేదు.మార్చి లో జరిగే షెడ్యూల్‌ కోసం హీరోయిన్ ను రంగంలోకి దించే అవకాశం ఉంది.మొత్తానికి ఎన్టీఆర్‌ యొక్క సినిమా భారీ ఎత్తున చిత్రీకరణ జరపబోతున్నారు.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal

ఈ ఏడాది చివరి వరకు చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు.ఈ సినిమా లో ఎన్టీఆర్ కు జోడీగా ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ను ఎంపిక చేశారనే వార్తలు జోరుగా వస్తున్నాయి.

Advertisement

అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

తాజా వార్తలు