తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) తన 22 వ మహాసభలకు ముస్తాబు అవుతోంది.అంగరంగ వైభవంగా ఎన్నో విశిష్ట కార్యకార్యమాలకి రూపకల్పన చేస్తూ తెలుగువారికి అమెరికాలోని స్థానిక ప్రజలని ఆకట్టుకుంటోంది.
జులై 4, 5, 6 తేదీలలో జరగబోయే సభలకు ఎన్నో ఏర్పాట్లని సిద్ధం చేసింది.ఇదే వేదికపై ఎంతో మంది ప్రతిభావంతులకు విశిష్ట పురస్కారాలని సైతం అందించనుంది.
ఈ క్రమంలోనే ఎన్నో పోటీలని సైతం తానా నిర్వహించింది.
ఇదిలాఉంటే తానా నిర్వహించిన నవలల పోటీలో ఎన్నో నవలలు పరిశీలనకు రాగా కడప జిల్లా బాలరాజుపల్లెకు చెందిన సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రచించిన “కొండపొలం” నవల ఎంపిక అయ్యిందని తానా సంస్థ అధ్యక్షుడు సాటీస్ వేమన తెలిపారు.
ఈ పోటీలో గెలిచిన విజేతకు 2 లక్షల రూపాయల బహుమతిని అందిస్తామని తెలిపారు.
తానా నిర్వహించిన ఈ నవలల పోటీకి మొత్తం 58 నవలలు వచ్చాయని, అందులో నుంచీ కొండపొలం ఉత్తమ నవలగా ఎన్నిక అవ్వడం సంతోషంగా ఉందని రచయిత తెలిపారు.
ఈ నవలల పోటీకి న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ రచయితలు అంపశయ్య నవీన్, కాత్యాయనీ విద్మ వ్యవహరించారు.వీరు నాలుగు నవలలు ఎంపిక చేయగా వాటిలో కొండపొలం నవల ఉత్తమ నవలగా ఎంపిక అయ్యిందని తెలిపారు నిర్వహకులు