ఐదు రోజుల క్రితం అమెరికా నుంచి స్వదేశానికి వచ్చిన ఒక ఎన్నారై ఆత్మహత్యగాకు పాల్పడిన ఘటన సూరత్లో సోమవారం జరిగింది.సూరత్ పరిధిలోని సిటీ లైట్ ప్రాంతంలో ఏడు అంతస్తుల భవంతి పై నుంచి దూకి ఎన్నారై ప్రాణాలు తీసుకున్నాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.పూర్తి వివరాల ఇలా ఉన్నాయి.
యుఎస్ లో ఉండే దిపేష్ పంజాబీ అనే 38 ఏళ్ల ఎన్నారై ఐదు రోజుల క్రితం ఆయన స్వస్థలం అయినా పుణె కు వచ్చాడు.ఈ క్రమంలో సోమవారం సూరత్ లోని సిటీ లైట్ ఏరియాలో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చి, మధ్యాహ్నం సమయం కావడంతో బంధువులు భోజనం చేయమని అడిగారు కానీ అతడు భోజనం చేసేందుకు నిరాకరించాడు.
తరువాత మధ్యాహ్నం 1.30 నిమిషముల సమయంలో వాంతి వస్తుందని బాల్కనీలోకి వెళ్ళాడు.ఆ తర్వాత తన రూమ్ కి వచ్చి నిద్రపోయాడు.మళ్లీ ఒక 30 నిమిషముల తర్వాత బాల్కోనోలోకి వచ్చి నిలబడి, బాల్కనీలో నిలబడిన అతడిని ఇంట్లోంచి బంధువులు చూస్తుండగానే గట్టిగా అరుస్తూ బాల్కనీ నుంచి కిందకు దూకేశాడు.
ఏడు అంతస్తుల భవనం కావడంతో దిపేష్ అక్కడికక్కడే చనిపోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా దీపేష్ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు విచారణలో తెలిసింది.అతడి కుటుంబం అమెరికాలో స్థిరపడినట్లు సమాచారం.అనారోగ్యంతో బాధపడుతున్న దిపేష్ తన తల్లిదండ్రులతో స్వదేశానికి వెళ్తున్నానని చెప్పాడు.నీ ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడు రిస్క్ ఎందుకు తర్వాత వెళ్ళొచ్చు కదా అని తల్లిదండ్రులు ఎంతో చెప్పినా వినకుండా ఇండియా వచ్చాడు.
ఐదు రోజుల క్రితం స్వదేశానికి వచ్చిన దీపేష్ అంతలోనే ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.







