ఎన్నారై దారుణ హత్య.. అతని ఫాదర్ ఒక ఆర్మీ కెప్టెన్, విస్తుగొలిపే నిజాలు!

కెనడాలో శాశ్వత నివాసి అయిన భారత సంతతి వ్యక్తి నిహాంగ్ ప్రదీప్ సింగ్ (24 ఏళ్ల) దారుణంగా హత్య చేయబడ్డాడు.

హోలా మహల్లే జాతీయ పండుగ సందర్భంగా బిగ్గరగా, అశ్లీలమైన సంగీతాన్ని ప్లే చెయ్యొద్దని ప్రదీప్ డిమాండ్ చేశాడు.

దీంతో పోకిరీలు అతడిని చంపేశారు.అందరి ముందే ఆ పోకిరిలు ప్రదీప్‌ని చంపిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రదీప్ సింగ్ సెప్టెంబరులో గురుదాస్‌పూర్‌లోని ఘాజికోట్ గ్రామంలోని తన స్వగ్రామానికి వచ్చి మార్చి 5న హోలా-మహల్లాను చూడటానికి శ్రీ ఆనంద్‌పూర్ సాహిబ్‌కు వెళ్లాడు.తిరిగి వస్తుండగా వాహనంలో కొందరు పోకిరీలు బిగ్గరగా, అసభ్యకరమైన పాటలు ప్లే చేయడం గమనించాడు.

అతను వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, వారు అతనిపై కత్తులతో దాడి చేశారు.ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన ఎన్నారై ప్రదీప్ అక్కడికక్కడే మరణించాడు.

Nri Brutal Murder His Father Is An Army Captain, Disturbing Facts, Nri Punjabi Y
Advertisement
NRI Brutal Murder His Father Is An Army Captain, Disturbing Facts, NRI Punjabi Y

సింగ్ ఆర్మీ కుటుంబం నుంచి వచ్చాడు.అతని తండ్రి గుర్బక్ష్ సింగ్ ఇండియన్ ఆర్మీలో కెప్టెన్‌గా సేవలందించారు.అతని మేనమామ గుర్డియాల్ సింగ్ ఇటీవలే ఇండియన్ ఆర్మీ నుండి హవల్దార్‌గా పదవీ విరమణ చేశారు.

ప్రదీప్ తన ప్లస్ టూ విద్యను పూర్తి చేసిన తర్వాత 2016లో కెనడా వెళ్ళాడు.ఇప్పుడు దేశంలో శాశ్వత నివాసి హోదాను సంపాదించాడు.అతను అక్టోబర్‌లో ఒకరి వివాహానికి హాజరయ్యేందుకు భారతదేశానికి తిరిగి వచ్చాడు.

తరువాత ఆనంద్‌పూర్ సాహిబ్‌ని సందర్శించి స్నేహితుడితో కలిసి హోలా మొహల్లా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు.అదే అతని ప్రాణాలను తీసేసింది.

కాగా సింగ్ చిన్నతనం నుంచి బుధ దళ్ ఫాలో అవుతున్నాడు.

Nri Brutal Murder His Father Is An Army Captain, Disturbing Facts, Nri Punjabi Y
ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

ఈ సంఘటన సిక్కు సమాజంలో తీవ్ర విషాదాన్ని నింపింది.హత్య చేసిన దుండగులు సమీప గ్రామాలకు చెందిన వారు కావడం గమనార్హం.పోలీసులు దాడులు నిర్వహించి, నిందితుల్లో ఒకరిని గుర్తించారు.

Advertisement

దోషులకు తగిన కఠిన శిక్ష విధిస్తామని పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

తాజా వార్తలు