కమలా హారీస్‌కే కాదు.. నాకూ ఇండియాలో బంధువులున్నారు: జో బైడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి సమాజం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో స్థిరపడిన ఇండో అమెరికన్లు డెమొక్రాట్ల వైపు మొగ్గు చూపడంతో జో బైడెన్ విజయం సాధించారు.

ఇక భారత సంతతికి చెందిన కమలా హారీస్ ఉపాధ్యక్ష బరిలో నిలవడం ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపింది.ఈ క్రమంలో కమల అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎన్నిక కావడంతో ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు మిన్నంటాయి.

కమలా హారీస్‌ పూర్వీకులు తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా మన్నార్‌కుడి సమీపంలోని తులసేంద్రపురం గ్రామం.ఆమె తల్లి తరపు తాత ముత్తాతలు ఇక్కడి వారే.

అమెరికా ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలాహారీస్ పేరు ప్రకటించిన రోజు నుంచి ఈ గ్రామంలో ఆమె గెలుపు కోసం ఎదురుచూపులు పెరిగాయి.కమల విజయకేతనం ఎగుర వేయాలని కాంక్షిస్తూ ఆ గ్రామంలోని ఆలయంలో ప్రతి రోజూ పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు.

Advertisement
Not Just Kamala Harris, Joe Biden Too Has Indian Link-కమలా హారీ�

ఈ పరిస్థితుల్లో అమెరికా ఎన్నికల్లో తొలి మహిళా ఉపాధ్యక్షురాలుగా కమలా హారీస్‌ ఘన విజయం సాధించడంతో తులసేంద్రపురం ఆనందానికి అవదులు లేకుండా పోయింది.

Not Just Kamala Harris, Joe Biden Too Has Indian Link

ఈ సంగతి పక్కనబెడితే కేవలం కమలా హారీస్‌కే కాదు.తనకు కూడా భారతదేశంలో బంధువులు వున్నారని చెప్పారు అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్.తమ కుటుంబానికి చెందిన ఐదుగురు దూరపు బంధువులు ముంబయిలోనే ఉన్నారని ఆయన అన్నారు.

వాషింగ్టన్‌లో జరిగిన ఓ సమావేశంలో ఈ విషయాన్ని మరోసారి బైడెన్ ప్రస్తావించడమే కాదు, వారి వివరాలను తెలిపారు.అయితే, ఈ వివరాలను జో వెల్లడించినప్పటికీ తామే బైడెన్ బంధువులమని ఇప్పటివరకూ ఎవ్వరూ స్పందించకపోవడం గమనార్హం.

భారత్‌లో 2013లో పర్యటించిన బైడెన్.జులై 24న బాంబే స్టాక్‌ ఎక్ఛేంజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు.

న్యూస్ రౌండప్ టాప్ 20

ఆ సమయంలో ‘బైడెన్‌ ఫ్రమ్‌ ముంబయి’ అంటూ తనకు భారత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.‘భారత్‌లో పర్యటించడం ఎంతో గర్వంగా భావిస్తాను.

Advertisement

ముఖ్యంగా ముంబయికి రావడం నాకెంతో ఆనందంగా ఉంది.నేను 29ఏళ్ల వయసులో తొలిసారి సెనేటర్‌గా ఎన్నికయ్యా.

ఆ సమయంలో భారత్‌ నుంచి బైడెన్‌ పేరుతో దూరపు బంధువు అయ్యే వ్యక్తి నుంచి ఉత్తరం వచ్చింది.అయితే, తర్వాత వారి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదని చింతిస్తున్నాను’ అని బైడెన్‌ వ్యాఖ్యానించారు.

అనంతరం రెండేళ్ల తర్వాత 2015లో వాషింగ్టన్‌ వేదికగా భారత్-అమెరికా పౌర అణు ఒప్పందం 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్ భారత్‌లోని తమ బంధువుల గురించి స్పష్టత ఇచ్చారు.‘వరుసకు ముత్తాత అయ్యే జార్జ్ బైడెన్ ఈస్ట్‌ ఇండియా ట్రేడింగ్‌ కంపెనీ లో కెప్టెన్‌గా పనిచేసి పదవీ విరమణ అనంతరం ముంబయిలోనే స్థిరపడ్డారని ఆయన చెప్పారు.

అంతేకాదు ఆయన భారతీయ మహిళను వివాహం చేసుకున్నారని వారి మొబైల్‌ నంబర్‌ సహా వివరాలను నాకు కొందరు అందించారని గుర్తుచేసుకున్నారు.అయితే, ఇప్పటివరకు వారిని తాను సంప్రదించలేదు.

కానీ, వారిని కలిసే ప్రయత్నం చేస్తాను’ అని నాటి సమావేశంలో బైడెన్ స్పష్టం చేశారు.

తాజా వార్తలు