రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో ‘ప్రజాపాలన’ కార్యక్రమం కొనసాగుతోంది.ఈ మేరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.ఇది దొరల ప్రభుత్వం కాదు.ప్రజల ప్రభుత్వమని స్పష్టం చేశారు.
ప్రజల వద్దకే పాలన అందిస్తామని చెప్పారు.ప్రభుత్వాన్ని ప్రజలకే అంకితం చేస్తామన్న భట్టి ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ మాకోసమే పెట్టారని ప్రజలు భావించే విధంగా పాలన అందిస్తామని తెలిపారు.
తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు.ఇందులో ఇప్పటికే రెండు పథకాలను మొదలు పెట్టామని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ప్రజల దగ్గరికే వెళ్లి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని ఆయన తెలిపారు.ఇవాళ ప్రారంభమైన అభయహస్తం గ్యారెంటీ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వచ్చే నెల 6వ తేదీ వరకు కొనసాగనుంది.







