వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా( YCP Minister Roja ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం రోజా టీవీ షోలకు, సినిమాలకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.
అయితే వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్తకు భారీ షాక్ తగింది.రోజా భర్తపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
పరువు నష్టం కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉన్నా రోజా భర్త సెల్వమణి( Roja Husband Selvamani ) మాత్రం విచారణకు హాజరు కాలేదు.

చెన్నై జార్జ్ టౌన్ కోర్ట్( Chennai George Town Court ) సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం.రోజా భర్త సెల్వమణి పలు సినిమాలకు డైరెక్టర్ గా పని చేసి కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరును సంపాదించుకున్నారు.2016 సంవత్సరంలో ముకుంద్ చంద్ బోత్రా అనే సినీ ఫైనాన్షియర్ ఓ కేసుకు సంబంధించి అరెస్ట్ కావడం జరిగింది.అయితే ఆ సమయంలో సెల్వమణి ఒక ఛానల్ లో మాట్లాడుతూ ముకుంద్ కారణంగా తాను ఇబ్బంది పడ్డానని చెప్పారు.
అయితే సెల్వమణి చేసిన కామెంట్ల వల్ల తన పరువుకు భంగం కలిగిందని ముకుంద్ కోర్టును ఆశ్రయించారు.
తర్వాత రోజుల్లో అనారోగ్య సమస్యల వల్ల ముకుంద్ మృతి చెందగా ముకుంద్ కొడుకు గగన్ బోత్రా( Gagan Bothra ) ఈ కేసును కొనసాగిస్తున్నారు.సోమవారం రోజున ఈ కేసు విచారణకు సెల్వమణి హాజరు కావాల్సి ఉండగా ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

కోర్టు తీసుకున్న నిర్ణయంతో రోజా అభిమానులు షాకయ్యారు.సెల్వమణి ఈ కేసును సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని ఉంటే బాగుండేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నాన్ బెయిలబుల్ వారెంట్( Non Bailable Warrant ) విషయంలో సెల్వమణి రియాక్షన్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.రోజా కుటుంబం వివాదాలకు దూరంగా ఉంటే మంచిదని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.







