Actor Naresh Jamba Lakidi Pamba : నా సినిమాలను రీమేక్ చేసే సత్తా ఎవరికీ లేదు.. నటుడు నరేష్ కామెంట్స్ వైరల్?

ప్రస్తుతం రీమేక్ సినిమాలు బాగా వస్తున్న సంగతి తెలిసిందే.చాలా వరకు స్టార్ట్ హీరోలంతా రీమేక్ సినిమాలకు అలవాటు పడుతున్నారు.

పైగా మంచి సక్సెస్ లు కూడా అందుకుంటున్నారు.ఒకప్పుడు మంచి కంటెంట్తో విడుదలైన సినిమాలను ఇతర భాషల నుండి తీసుకోని మరి రీమేక్ చేస్తున్నారు.

తెలుగు భాష నుండి కూడా చాలా సినిమాలు ఇతర భాషలలో రీమేక్ చేసుకొని వెళ్తున్నారు దర్శకనిర్మాతలు.అయితే ఈ మధ్య రీమేక్ సినిమాలు చాలా వస్తున్నాయి కానీ.

ఒకప్పుడు ఏదైనా హిట్ సినిమాను రీమేక్ చేయాలి అంటే అది సాధ్యమైన విషయం కాదని చెప్పాలి.ఎందుకంటే అప్పట్లో వచ్చే కంటెంట్ అలాంటిది.

Advertisement

అయినా కొన్ని సినిమాలను దర్శకనిర్మాతలు రీమేక్ చేయడానికి ప్రయత్నించారు.చాలా వరకు స్టార్ హీరోల సినిమాలు మాత్రమే రీమేక్ చేసేవాళ్లు.

అయితే తాజాగా తన సినిమాలు రీమేక్ చేసే సత్తా ఎవరికీ లేదంటూ సీనియర్ నటుడు నరేష్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

ఒకప్పుడు హీరోగా మంచి మంచి సినిమాలలో చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నరేష్.ఆ తర్వాత వయసు పెరుగుతున్న కొద్ది సహాయక పాత్రలలో కొనసాగుతున్నాడు.

హీరో కంటే ఎక్కువగా సహాయ పాత్రలలో సినిమాలు చేశాడు నరేష్.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు.

How Wild Robin Works For UK Mobile Players : Skill, Luck, And Geolocation Explained
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 13 , శుక్రవారం , 2023

ఇక ఈయన గతంలో మా అధ్యక్షుని బాధ్యతలు కూడా మోసిన సంగతి తెలిసిందే.ఇక ఈయన ఒక నటుడుగా కాకుండా వ్యక్తిగతంగా మాత్రం చాలా హాట్ టాపిక్ అయ్యాడు.

Advertisement

మొన్నటి వరకు తన వ్యక్తిగత విషయాలలో వార్తల్లో నిలిచాడు.ఇక ఈయన ఏదైనా కామెంట్ చేస్తే మాత్రం అది వెంటనే వైరల్ అవుతుంది.

కొన్ని కొన్ని సార్లు అది వివాదాలుగా మారుతుంది.గతంలో కూడా ఈయన కొందరి హీరోలని ఉద్దేశించి బాగా కామెంట్స్ చేశాడు కూడా.

ఇక ఇదంతా పక్కన పెడితే గతంలో ఈయన నుండి మంచి మంచి కంటెంట్ వచ్చిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

అందులో చాలా వరకు మంచి హిట్టు అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి.అయితే ఈయన గతంలో జంబలకడిపంబ సినిమాలో నటించగా ఈ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ఆ తరం ప్రేక్షకులకు అందరికీ తెలిసిందే.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ తన వ్యక్తిగత విషయాలతో పాటు తన సినీ లైఫ్ విషయాలను కూడా పంచుకున్నాడు.

అయితే జంబలకడిపంబ సినిమాలో తను వేసుకున్న లేడీ గెటప్ గురించి కొన్ని విషయాలు బయట పెట్టాడు.తనకు లేట్ గెట్ అప్ వేసుకోవాలి అన్న కోరిక ఉండేదని.ఎందుకంటే తాను అచ్చం తన అమ్మ లాగా ఉంటాడని అందుకే ఒక్కసారి లేడీ గెటప్ లో వేసుకొని చూడాలని అనుకున్నాడట.

అంతేకాకుండా తను నటించిన రెండు మూడు సినిమాల పేర్లు గురించి చెబుతూ తన సినిమాలో రీమేక్ చేయాలంటే చాలా కష్టమని ఎందుకంటే ఆ కంటెంట్లతో సినిమా చేయాలని సత్తా ఎవరికి లేదని కామెంట్ చేశాడు.ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.