ఇకపై వాహన సంబంధింత పనులు మరింత సులభం... సమయం కూడా ఆదా!

మీ వాహనం, డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన పనుల కోసం మీరు తరచుగా ఆర్టీఓ కార్యాలయాన్ని సందర్శించాల్సి వస్తుంటుంది.

దీని వల్ల చాలామంది తమ వ్యక్తిగత పనులన మానుకున ఈ పనుల్లో నిమగ్నాం కావాల్సి వస్తుంటుంది.

అయితే ఇకపై వాహనం, డ్రైవింగ్‌ లైసెన్స్‌కు సంబంధించిన పనుల కోసం ఆర్‌టీఓ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.

రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాలు

ఆర్టీఓ సేవల కోసం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నూతన ఆదేశాలను విడుదల చేసింది.

ఇందులోభాగంగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, పర్మిట్ వంటి 58 ఆర్టీఓ సేవలను సంపూర్ణంగా ఆన్‌లైన్ చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.ఆర్టీఓ అందించే ఈ 58 సేవలన్నీ ఆధార్ ప్రమాణీకరణ ద్వారా వినియోగదారులకు అందించనున్నారు.

ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు.మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో వినియోగదారులు ఇకపై ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం లేదు.

Advertisement

ఇటువంటి ఆన్‌లైన్ సేవలను అందించడంలో జాప్యం జరగకుండా చూసుకోవాలని మంత్రిత్వ శాఖ అన్ని ఆర్టీఓ కార్యాలయాలోని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.ఈ సేవలు ఆన్‌లైన్‌లోకి మారడంతో ఆర్టీవోలో అధికారులకు పని భారం తగ్గనుంది.

అలాగే గణనీయంగా సమయం కూడా ఆదా అవుతుంది.

ఆధార్ ప్రామాణీకరణ.

రవాణా పోర్టల్‌లో ఆన్‌లైన్ సేవలను పొందాలనుకున్నవారు తమ ఇష్టానుసారం ఆధార్ ప్రామాణీకరణను సమర్పించాలి.ఆధార్ నంబర్ లేని వారు ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి వారికి సంబంధించిన మరేదైనా గుర్తింపు కార్డు చూపించి తమ పని పూర్తి చేసుకోవచ్చు.ఆన్‌లైన్ సేవల్లో లెర్నర్స్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడం, దానిలో ఏవైనా మార్పులు చేయడం మొదలైనవి ఉంటాయి.

ఇదేవిధంగా ఆధార్ ద్వారా ఆన్‌లైన్‌లో డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, లైసెన్స్ రెన్యూవల్ కూడా చేయించుకోవచ్చు.

డ్రైవింగ్ లైసెన్స్ అప్‌డేట్

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
సినిమా ట్రైలర్స్ వ్యూస్ వెనుకున్న అసలు మోసం ఏంటో తెలుసా?

డ్రైవింగ్ లైసెన్స్‌లో పేరు, చిరునామా, పుట్టిన తేదీలో మార్పులను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయవచ్చు.దీనితో పాటు వాహనాల రిజిస్ట్రేషన్, డూప్లికేట్ ఆర్‌సి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.రవాణా పోర్టల్‌తో పాటు, ఆన్‌లైన్ సేవలను అందుకునేందుకు మీరు పార్క్ ప్లస్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Advertisement

ఈ యాప్‌లో పేరు నమోదు చేసుకున్న తర్వాత, వినియోగదారు తన వాహనానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఒకే చోట పొందే సదుపాయం ఏర్పడుతుంది.