ఈసారి వెల్లంపల్లికి డిపాజిట్లు కూడా రావు...టీడీపీ నేత జలీల్ ఖాన్ కామెంట్స్...

పశ్చిమనియోజకవర్గంలో రాజకీయం సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్న చందంగా తయారైంది.

టీడీపీ హయాంలో చేసిన నిర్మాణాలకు రంగులు మార్చి మేమె చేశామని వైసీపీ వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు.

కోట్లా రూపాయలతో టీడీపీ హయాంలో షాదీఖాన నిర్మిస్తే దాన్ని ఇప్పటి వరకూ పూర్తి చేయలేదు.దానిమీద కూడా ఈ మంత్రి తానే చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నాడు.

నియోజకవర్గంలో రోడ్లు కూడా మేమె వేయించినవే వెల్లంపల్లి గాలిలో గెలిచాడు.మేము ఎదురుగాలిలో గెలిచాం.

ఈసారి వెల్లంపల్లికి డిపాజిట్లు కూడా రావు.నియోజకవర్గంలో ఈ మంత్రి చేసిన అక్రమాలు ఏ నాయకుడు చేయలేదు దేవాలయాల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి చంద్రబాబు, దేవాలయాలను దోచుకుంటున్న మంత్రి వెల్లంపల్లి.

Advertisement

అసలు నియోజకవర్గ అభివృద్ధికి వెల్లంపల్లి ఏం చేశాడో చెప్పమనండి.ఇక్కడ అన్ని పనులూ చంద్రబాబు హయాంలో జరిగినవే.

ఇక ఈ మంత్రి సీన్ అయిపొయింది.ఒక వారంలో మంత్రి పదవి పోతుంది.

మంత్రి ఇంటి ముందు రోడ్ కూడా టీడీపీ హయాంలో వేసిందే.నియోజకవర్గ అభివృద్ధికి ఎవరు ఎంత ఖర్చు చేసారో కార్పొరేషన్ వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు.

మొత్తంగా చెప్పాలంటే నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనులు జరిగినా అవి చంద్రబాబు హాయంలో మొదలుపెట్టినవే.

అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?
Advertisement