ఆదికేశవ ఈ బజ్ సరిపోతుందా..?

ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ మూవీ ఆదికేశవ( Adikesava ) ఆగష్టు లాస్ట్ వీక్ రిలీజ్ కు రెడీ అవుతుంది.

శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తుంది.

ఈ సినిమాలో శ్రీలీల( Srileela )హీరోయిన్ గా నటిస్తుంది.సినిమా నుంచి టీజర్ ఇప్పటికే రిలీజ్ కాగా ఊరిలో శివాలయాన్ని కాపాడే వ్యక్తి పాత్రలో హీరో కనిపిస్తున్నాడు.

అయితే ఉప్పెన తో ఎంట్రీతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత కొండపొలం, రంగ రంగ వైభవంగా సినిమాలతో ఫ్లాప్ అందుకున్నాడు.

వైష్ణవ్ తేజ్ ఆశలన్నీ ఆదికేశవ మీద పెట్టుకున్నాడు.అయితే ఆదికేశవ సినిమా కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉన్నా సరే సినిమా గురించి ఎలాంటి బజ్ ఏర్పడలేదు.ఆడియన్స్ కి సినిమాను రీచ్ చేసే విషయంలో దర్శక నిర్మాతలు కూడా సైలెంట్ గా ఉన్నారు.

Advertisement

అసలే ఆగష్టు, సెప్టెంబర్ లో భారీ సినిమాల రిలీజ్ ఉండగా ఆదికేశవ టీం ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడం పై ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.వైష్ణవ్ తేజ్ కి ( Vaishnav Tej )ఈ సినిమా అయినా హిట్ జోష్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?
Advertisement

తాజా వార్తలు