కోలీవుడ్ భామ నివేదా పేతురాజ్ ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది.తమిళంలో ఓ మోస్తారు ఇమేజ్ సొంతం చేసుకున్న అమ్మడు తెలుగులో యువ హీరోల సరసన లక్కీ ఛాన్సులు అందుకుంటుంది.
మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నివేదా పేతురాజ్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో కూడా నటించింది.విశ్వక్ సేన్ తో పాగల్ సినిమాలో నటించిన అమ్మడు ఆ సినిమా సక్సెస్ లో భాగమైంది.
ఇక ఇదిలాఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా నివేదా పేతురాజ్ ఛాన్స్ అందుకున్నట్టు టాక్.చిరు, కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో వస్తున్న సినిమాలో నివేదా పేతురాజ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందట.ఈ సినిమాలో రవితేజ కూడా ఒక ప్రాముఖ్యత గల పాత్రలో నటిస్తున్నాడు.
రవితేజ సరసన నివేదా పేతురాజ్ నటిస్తుందని టాక్.చిరంజీవికి జోడీగా నయనతారని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
మొత్తానికి నివేదా పేతురాజ్ మెగా ఛాన్స్ అందుకుందని చెప్పొచ్చు.తప్పకుండా అమ్మడికి ఈ సినిమాతో నివేదాకి సూపర్ క్రేజ్ రావాలని కోరుతున్నారు ఆమె ఫ్యాన్స్.
సినిమాలో నివేదా పేతురాజ్ పాత్ర ఎలా ఉండబోతుంది అన్నది మాత్రం ఇంకా రివీల్ అవలేదు.








