టాలీవుడ్‌లో ఇటీవల వరుసగా బయోపిక్ చిత్రాలను తెరకెక్కిస్తూ దర్శకనిర్మాతలు దూసుకుపోతున్నారు.అలనాటి లెజెండరీ నటి సావిత్రి బయోపిక్ మహానటి, నందమూరి తారక రామారావు బయోపిక్ ఎన్టీఆర్, మల్లేశం వంటి సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తి సక్సె్స్ అయ్యాయి.
ఈ సినిమాల్లో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు రావడమే కాకుండా పల అవార్డులు కూడా దక్కించుకున్నారు.కాగా ఇప్పుడు ఓ భారీ మల్టీస్టారర్ మూవీలో నటించే ఛాన్స్‌ను అందాల భామ నిత్యా మీనన్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
భారతదేశానికి ఒలింపిక్స్ క్రీడల్లో తొలి గోల్డ్ మెడల్‌ను అందించిన మహిళా క్రీడాకారిణీ కరణం మళ్లీశ్వరి జీవితగాధను కోన ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో సంజనా రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తు్న్నారు.పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న చిత్ర యూనిట్, ఈ సినిమాలో లీడ్ రోల్‌లో నటించేందుకు తొలుత అందాల భామ నిత్యా మీనన్ చెంతకు చేరింది.
అయితే ఆమె ఈ సినిమాలో నటించనని చెప్పి రిజెక్ట్ చేసింది.ఇలాంటి భారీ బయోపిక్ చిత్రంలో నటించే ఛాన్స్‌ను ఆమె రిజెక్ట్ చేయడంతో చిత్ర యూనిట్, ఈ సినిమాలో మరో హీరోయిన్‌ను తీసుకునేందుకు రెడీ అయ్యారు.
అయితే తాప్సీ పన్ను, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్ల పేర్లు ఈ సినిమా కోసం ముఖ్యంగా వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమాను ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా కరణం మళ్లేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.







