వైసీపీ ట్రబుల్స్ : ' నిమ్మగడ్డ ' మళ్లీ తగులుకున్నాడే ? 

కీలకమైన ఎన్నికల సమయంలో ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద తలనొప్పి మొదలయ్యాయి.

ముఖ్యంగా మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పెద్ద తిక్కే వచ్చి పడింది .

గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ పని చేశారు.ఆ తర్వాత జగన్ ప్రభుత్వంలోనూ కొంతకాలం పనిచేశారు.

అయితే నిమ్మగడ్డ రమేష్ టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లుగా అప్పట్లో వైసీపీ నేతలు అనేక విమర్శలు 2016లో టిడిపి ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్నికల కమిషనర్ గా నియమితులైన నిమ్మగడ్డ రమేష్( Nimmagadda Ramesh ) జగన్ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల తరువాత ఆయనను పదవి నుంచి తొలగించారు ఆ తర్వాత ఆయన స్థానంలో తమిళనాడు నుంచి కనగారాజును ఎన్నికల కమిషనర్ గా నియమించారు.ఆయన కొంతకాలమే పనిచేశారు.

Nimmagadda Ramesh Struggle Against Ycp Govt , Nimmagadda Ramesh, Tdp, Janasena

ఇక హైదరాబాదులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అప్పటి టిడిపి ,బిజెపి( TDP, BJP ) నేతలను ఓ ప్రైవేట్ హోటల్లో కలవడం వంటి వ్యవహారాలను వైసీపీ హైలెట్ చేసి ఆయనపై అనేక విమర్శలు చేసింది.జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారి నిమ్మగడ్డ రమేష్ వ్యవహారం పై నిప్పులు చెరుగుతూ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా జగన్ నిమ్మగడ్డ పై విమర్శలు చేశారు.ఏపీ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు నుంచి తప్పుకున్న దగ్గర నుంచి హైదరాబాద్ కు వెళ్ళిపోయిన నిమ్మగడ్డ సైలెంట్ అయిపోయారు .తాజాగా ఎలక్షన్ వాచ్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి ఏపీ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు .మేధావులు తటస్తులతో కలిసి వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్లుగా ఆయన వ్యవహార శైలి కనిపిస్తుంది.

Nimmagadda Ramesh Struggle Against Ycp Govt , Nimmagadda Ramesh, Tdp, Janasena
Advertisement
Nimmagadda Ramesh Struggle Against YCP Govt , Nimmagadda Ramesh, Tdp, Janasena

ఓటర్ల నమోదు నుంచి పోలింగ్ ప్రక్రియ వరకు దగ్గరుండి చూసుకునేలా , న్యాయపరంగా అటు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసేలా నిమ్మగడ్డ రమేష్ తన సంస్థ ద్వారా ప్రయత్నాలు చేస్తూ ఉండడం వైసిపి కి మరింత మంట పుట్టిస్తుంది .గతంలో వాలంటీర్లు దొంగ ఓటర్లను నమోదు చేయించారని ఎన్నికల కమిషన్ కు నిమ్మ గడ్డ రమేష్ కు చెందిన సంస్థ ఫిర్యాదు చేసినట్లుగా వైసిపి నేతలు మండిపడుతున్నారు .ఆయన ఆధ్వర్యంలో ఉన్న సిటిజన్ ఫర్ డెమోక్రసీ తాజాగా వలంటీర్ల వ్యవహారం పైన ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో,  వారిని పెన్షన్ల పంపిణీ,  రేషన్ తదితర విధులను తప్పించింది.నిమ్మగడ్డ రమేష్ తో పాటు,  మాజీ ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం వంటి వారు సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థలు టార్గెట్ చేసుకోవడం తో ఆ పార్టీ కాస్త పెన్షన్ పడుతుంది.

కీలకమైన ఎన్నికల సమయంలో నిమ్మగడ్డ ఈ విధంగా దూకుడు చూపిస్తూ ఉండడం వైసిపికి మింగుడు పడడం లేదు.

Advertisement

తాజా వార్తలు