Nikki Haley : అమెరికా అధ్యక్ష ఎన్నికలు : బైడెన్, ట్రంప్‌ల వయసుపై నిక్కీహేలీ పంచ్‌లు

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది.ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ( Republican Party ) అభ్యర్ధిత్వం దక్కించుకునేందుకు పలువురు ప్రముఖులు పోటీపడగా వీరిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) ఎదురు లేకుండా దూసుకెళ్తున్నారు.

 Nikki Haley Mocks Trump And Biden Age During Final Pitch To South Carolina Prim-TeluguStop.com

రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినేషన్స్ కోసం పోటీపడిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామిలు పోటీలోంచి తప్పుకున్నారు.వీరిద్దరూ ట్రంప్‌కే మద్ధతు పలికారు.

దీంతో భారత సంతతికి చెందిన సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ ఒక్కరే ట్రంప్‌తో తలపడుతున్నారు.

ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

తాజాగా అధ్యక్షుడు జో బైడెన్, ట్రంప్‌ల వయసుపై నిక్కీ హేలీ( Nikki Haley ) ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఆమె సొంత రాష్ట్రం సౌత్ కరోలినా ప్రైమరీకి( South Carolina Primary ) ముందు సార్వత్రిక ఎన్నికల్లో బైడెన్‌ను ఓడించగలిగేది తానేనని ధీమా వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో అధ్యక్ష అభ్యర్ధులు 80 ఏళ్ల వయసులో వున్నారంటూ ట్రంప్ (77),( Trump ) జో బైడెన్ (81)లపై( Joe Biden ) పంచ్‌లు విసిరారు.అమెరికా ప్రజల కోసం 8 ఏళ్ల పాటు పగలు , రాత్రి కష్టపడి పనిచేయగలిగే వ్యక్తి కావాలి, డ్రామా లేదు, ప్రతీకారాలు లేవు అని నిక్కీ హేలీ అన్నారు.

Telugu Biden, Democrats, Donald Trump, Nikki Haley, Nikkihaley, Joe Biden, Repub

తాజా సర్వేల ప్రకారం సౌత్ కరోలినాలో ట్రంప్ కంటే హేలీ 28 పాయింట్లతో వెనుకంజలో వున్నారు.కానీ ఆమె ప్రచార నిర్వాహకుడు బెట్సీ ఆంక్నీ శుక్రవారం ఉదయం విలేకరులతో మాట్లాడుతూ.హేలీ తన పట్టు వదలరని, సూపర్ ట్యూజ్‌డే వరకు పోరాడతానని చెప్పారు.తాము ముందుకు సాగుతున్న మార్గాన్ని చూస్తున్నప్పుడు.ఇది ఎత్తైన యుద్ధం అని మాకు తెలుసునని బెట్సీ తెలిపారు.నవంబర్‌లో ఎవరు గెలవగలరు, డెమొక్రాట్‌లను ఓడించగలరు, చివరికి మన దేశాన్ని తిరిగి ట్రాక్‌కు తీసుకురాగలరు అన్నదే తమ ముందున్న లక్ష్యమన్నారు.

Telugu Biden, Democrats, Donald Trump, Nikki Haley, Nikkihaley, Joe Biden, Repub

సౌత్ కరోలినాలోని హేలీ మద్ధతుదారులు కొందరు మాట్లాడుతూ.ట్రంప్‌ను లాక్ చేయబడటం (అరెస్ట్) , లేదా ఆరోగ్య సమస్య వంటి ఏదైనా జరిగితే హేలీ అధ్యక్ష రేసులో వుండాలని ఆకాంక్షించారు.ఆమె గెలుస్తుందని తాము ఊహించలేదని కూడా ఒప్పుకున్నారు.అయితే తాను రేసు నుంచి తప్పుకోవడం లేదని, మార్చి 5న జరిగే పోటీకి ముందు పలు రాష్ట్రాల్లో ప్రచారం చేసేందుకు తాను ఎదురుచూస్తున్నానని నిక్కీ హేలీ మంగళవారం పునరుద్ఘాటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube