నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా వస్తున్న సినిమా 18 పేజీస్.సుకుమార్ కథ అందించగా కుమారి 21f ఫేమ్ సూర్య ప్రతాప్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ మూవీ నిర్మిస్తున్నారు.సినిమా షూటింగ్ పూర్తి కాగా ఫస్ట్ లుక్ టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.18 పేజీస్ ఓ అందమైన ప్రేమకథగా రాబోతుందని ఈ టీజర్ చూస్తే అర్ధమవుతుంది.
నిఖిల్ తన కెరియర్ లో చేస్తున్న క్రేజీ లవ్ స్టోరీ ఇదని చెప్పొచ్చు.
సుకుమార్ రాసిన కథ కాబట్టి ఖచ్చితంగా ఆయన మార్క్ ఉంటుంది.కుమారి 21ఎఫ్ సినిమా ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యిందో తెలిసిందే.
మరి 18 పేజీస్ కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.ఈ సినిమాతో పాటుగా నిఖిల్ కార్తికేయ 2 సినిమాని కూడా పూర్తి చేశాడు.రెండు సినిమాలకు మంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.18 పేజీస్ ఎలాగు గీతా ఆర్ట్స్ కాబట్టి మంచి డేట్ కే రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ రెండు సినిమాలతో నిఖిల్ మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు.