కార్తికేయ కూడా బాగానే పెడుతున్నాడుగా!

యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సూపర్ సక్సెస్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే.

పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన కార్తికేయ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సె్స్ అయ్యింది.

ఇక ఈ సినిమాను దర్శకుడు చందు ముండేటి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా కార్తికేయ-2 చిత్రాన్ని తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ఇప్పటికే రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.

Huge Budget For Nikhil Karthikeya 2, Nikhil, Karthikeya 2, Budget, Chandoo Monde

ఇటీవల ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను కూడా పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

అయితే ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ భారీ బడ్జెట్‌ను కేటాయించేందుకు రెడీ అవుతోంది.ఈ సినిమాలో అదిరిపోయే రేంజ్‌లో వీఎఫ్ఎక్స్ పనులు ఉండబోతున్నాయని, వాటి కోసం ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.దేశంలోని వివిధ ఆలయాలకు సంబంధించిన బ్యాక్‌డ్రాప్‌తో ఈ కథ వస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Advertisement

ఇక కార్తికేయ చిత్రం అందుకున్న సక్సెస్‌ను మరోసారి రిపీట్ చేసేందుకు సీక్వెల్‌ను రెడీ చేస్తున్నారు చిత్ర యూనిట్.ఇక ఈ సినిమా షూటింగ్‌ను కేరళలోని అడవుల్లో మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఈ సినిమాలో నిఖిల్ అదిరిపోయే లుక్‌లో కనిపిస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఇక ఈ సినిమాను దర్శకుడు చందూ ముండేటి ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా చూస్తున్నాడని, ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

మరి కార్తికేయ-2 చిత్రం ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

నువ్వులను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..
Advertisement

తాజా వార్తలు