కార్తికేయ 2 తో సెన్సేషనల్ హిట్ అందుకున్న నిఖిల్ ప్రస్తుతం సూర్య ప్రతాప్ డైరక్షన్ లో 18 పేజెస్ సినిమా చేస్తున్నాడు.
సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు.
ఈ సినిమా పూర్తై చాలారోజులు అవుతున్నా సరైన రిలీజ్ డేట్ దొరక్క ఆగిపోయింది.ఫైనల్ గా 18 పేజెస్ రిలీజ్ డేట్ లాక్ చేశారు.
ఈ ఏడాది చివర్లో డిసెంబర్ 23న క్రిస్ మస్ కానుకగా 18 పేజెస్ సినిమా వస్తుంది.ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.
ఆల్రెడీ కార్తికేయ 2 తో సూపర్ హిట్ అందుకున్న ఈ జోడీ మరో సినిమాతో వస్తున్నారు.నిఖిల్ 18 పేజెస్ కంప్లీట్ లవ్ స్టోరీగా వస్తుంది.
ఈ సినిమాతో కూడా నిఖిల్ మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంటాడని అంటున్నారు.సుకుమార్ కథ అంటే ఖచ్చితంగా అది హిట్ అని చెప్పొచ్చు.
కుమారి 21ఎఫ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సూర్య ప్రతాప్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.కార్తికేయ 2 తో వచ్చిన క్రేజ్ వల్ల నిఖిల్ 18 పేజెస్ కి భారీ బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తుంది.
ఓ విధంగా ఆ సినిమా వల్ల ఈ సినిమా నిర్మాతలు లాభ పడ్డారని చెప్పొచ్చు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy