నాగ చైతన్య మరియు అఖిల్ హీరోలుగా నటించిన సవ్యసాచి మరియు మిస్టర్ మజ్ను సినిమా ల్లో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్.తెలుగు లో ఈ అమ్మడు ఇస్మార్ట్ శంకర్ సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆ సినిమా తర్వాత వరుసగా టాలీవుడ్ లో సినిమాలు దక్కించుకుంటుందని అంతా భావించారు.కానీ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా మినహా మరి సినిమా ను కూడా ఈమె చేయడం లేదు.
హరిహర వీరమల్లు సినిమా లో చేస్తున్నందుకు గాను యంగ్ హీరోలకు జోడి గా ఈమె కు నటించే అవకాశాలు వస్తాయి.కానీ వాటిని తిరస్కరిస్తుందట.
హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత మాత్రమే తన తదుపరి సినిమా ను కమిట్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది.

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా హరి హర వీరమల్లు సినిమాలోని తన పాత్ర ఉంటుందని చాలా నమ్మకంగా చెబుతున్న నిధి అగర్వాల్ ముందు ముందు మరిన్ని సూపర్ హిట్ సినిమా ల్లో నటిస్తానని ధీమా తో ఉంది.పవన్ కళ్యాణ్ తో నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఫలితాన్ని బట్టి తదుపరి సినిమా ను మొదలు పెట్టాలి అని ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ భావిస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి.అన్ని వర్గాల ప్రేక్షకులనుఅలరించే విధంగా కథల ఎంపిక విషయం లో జాగ్రత్తగా ఉంటే కచ్చితంగా నిధి అగర్వాల్ ముందు ముందు స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిలిచి తెలుగు స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నిధి అగర్వాల్ కలలు నెరవేరి స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో నిలిచేనా చూడాలి.







