వేణు స్వామి పూజలు ఫలించాయ... గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన నిధి అగర్వాల్!

వేణు స్వామి ( Venu Swamy ) ప్రస్తుతం ఈయన పేరు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుంది.

ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తరచూ సినిమా సెలబ్రిటీలకు సంబంధించి వారి జాతకాలను చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఇలా సినిమా సెలబ్రిటీల జాతకాలను చెబుతూ ఉన్నటువంటి వేణు స్వామి చేత చాలా మంది సెలబ్రిటీలు వారి కెరియర్ కోసం ప్రత్యేకంగా పూజలు చేయించుకున్న సంగతి మనకు తెలిసిందే.ముందుగా రష్మిక మందన్న ( Rashmika Mandanna ) వేణు స్వామి చేత పూజలు చేయించడంతో ఈమె కెరియర్ విజయపతంలో దూసుకుపోతుంది.

ఇక రష్మిక బాటలోనే నిధి అగర్వాల్( Nidhi Aggarwal ) సైతం తన జాతకాన్ని వేణు స్వామికి చూపించి తన చేత ప్రత్యేక పూజలు చేయించారు.అందుకు సంబంధించిన ఫోటోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి.అయితే తాజాగా వేణు స్వామి పూజలు ఫలించాయని తెలుస్తోంది.

సక్సెస్ కోసమే వేణు స్వామి చేత పూజలు చేయించిన ఈమెకు ఒక డైరెక్టర్ ఫోన్ చేసి మరి తనకు సినిమాలో అవకాశం కల్పించారని తెలుస్తుంది.తాజాగా డైరెక్టర్ మారుతి( Maruthi ) పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) తో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Advertisement

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉండబోతున్నారు అంటూ మొదటి నుంచి ఒక వార్త వైరల్ గా మారింది.అయితే ఇందులో నటి శ్రీ లీలను( Sreeleela ) ఎంపిక చేయగా ప్రభాస్ పక్కన ఆమె చాలా పొట్టిగా కనిపించడంతో ప్రభాస్ రిజెక్ట్ చేశారు అంటూ వార్తలు వచ్చాయి.అయితే ఈ శ్రీ లీల స్థానంలోకి నటి నిది అగర్వాల్ ఎంపిక చేశారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే డైరెక్టర్ మారుతి ఏకంగా నిధి అగర్వాల్ కు ఫోన్ చేసి ఈ సినిమాలో అవకాశం కల్పించారనే వార్తలు వైరల్ గా మారడంతో ఈమె విషయంలో వేణు స్వామి పూజలు ఫలించాయి అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.

గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...
Advertisement

తాజా వార్తలు