యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రస్తుతం కాలం కలిసిరావడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఆర్ఆర్ఆర్ విడుదలై నాలుగు నెలలు అవుతున్నా తారక్ కొత్త సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.
మరోవైపు ఇతర టాలీవుడ్ స్టార్ హీరోలు వరుసగా ప్రాజెక్ట్ లను ప్రకటించడంతో పాటు ఆయా సినిమాల షూటింగ్ లో పాల్గొంటూ వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో తన సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు.అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కర్ణుడి కష్టాలను ఎదుర్కొంటున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవడంతో ఎన్టీఆర్ సినిమా విషయంలో ఆ తప్పు జరగకుండా కొరటాల శివ మరోసారి స్క్రిప్ట్ పై వర్క్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.కొరటాల శివ స్క్రిప్ట్ పనులు పూర్తి చేసే సమయానికి ఆచార్య నష్టాలను భర్తీ చేయాల్సిన బాధ్యత ఆయనపై పడింది.
కొరటాల శివ ఈ సమస్యలను కూడా పరిష్కరించిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో షూటింగ్ లు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆగష్టు 1వ తేదీ నుంచి షూటింగ్ లు బంద్ అయితే మళ్లీ ఎప్పటినుంచి షూటింగ్ లు మొదలవుతాయో చెప్పలేము.
ఏదో ఒక కారణం వల్ల ఎన్టీఆర్30 మూవీ షూటింగ్ అంతకంతకూ ఆలస్యం అవుతుండటంతో ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తెగ ఫీలవుతున్నారు.
తారక్ తర్వాత సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.తారక్ కొరటాల శివ కాంబో మూవీ పూర్తైతే తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ అయితే ఉంది. ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను పూర్తి చేశారని బోగట్టా.
వరుస విజయాలతో తారక్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy