తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త వ్యూహకర్త ! 

ఇటీవల కాలంలో తెలంగాణలో కాంగ్రెస్( Congress ) జోరు పెరిగింది.ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామనే ధీమా కనిపిస్తుంది .

 New Strategist For Telangana Congress, Kummari Srikanth, Congress Strategist, Ai-TeluguStop.com

దీనికి తోడు కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ,  ప్రియాంక గాంధీ ( Rahul Gandhi, Priyanka Gandhi )తో పాటు , తెలంగాణ కాంగ్రెస్ కీలక నాయకులంతా చేస్తున్న ప్రసంగాలలో కొత్తదనం కనిపిస్తోంది.అయితే దీని అంతటికి కారణం కాంగ్రెస్ కు  కొత్త రాజకీయ వ్యూహకర్తే కారణంగా తెలుస్తోంది .చాలా కాలం నుంచి తెలంగాణ కాంగ్రెస్ కు వ్యూహకర్త గా సునీల్ కానుగోలు పనిచేస్తున్నారు, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిచేందుకు సునీల్ వ్యూహాలు బాగా పనిచేశాయి.  అక్కడ ఆయనకు క్యాబినెట్ స్థాయి పదవిని కూడా ఇచ్చి కాంగ్రెస్ గౌరవించుకుంది.

Telugu Aicc, Pcc Telangana, Sunil Kanugolu, Telangana-Politics

దీంతోపాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు ఆయనే చూస్తున్నారు .అయితే కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లతో సునీల్ కానుగోలుకు( Sunil kanugolu ) వివాదాలు ఏర్పడడం,  మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు , మరికొంతమంది కీలక నేతలపై జరుగుతున్న దుష్ప్రచారానికి  సునీల్ కానుగోలు కారణమని ఆరోపణలు వినిపించాయి.ఇదిలా ఉంటే గత ఎనిమిది నెలలుగా కాంగ్రెస్ వ్యహకర్తగా కుమ్మరి శ్రీకాంత్ అనే వ్యూహకర్త కూడా సునీల్ టీమ్ లో పనిచేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.అయితే ఈ మధ్య కాలంలోనే తెలంగాణ కాంగ్రెస్ కు వ్యూహాలు అందించే కీలక బాధ్యతలు శ్రీకాంత్ తీసుకున్నట్టు సమాచారం.

  పార్టీలో చేరికలు దగ్గర నుంచి పాపులర్ సర్వేలు , బీఆర్ఎస్ ( brs )పై చేస్తున్న విమర్శలు,  రాహుల్ , ప్రియాంక గాంధీ స్పీచ్ లు ఇలా  అన్నిటిని కుమ్మరి శ్రీకాంత్ చూసుకుంటున్నట్లు సమాచారం.  ముఖ్యంగా కాంగ్రెస్ విధానాలతో పాటు,  ఆరు హామీలు , సోషల్ మీడియా లో యాక్టివ్ గా కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించడం  వంటివి శ్రీకాంత్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నట్లు సమాచారం .గాంధీ భవన్( Gandhi Bhavan ) లో ఒక వార్ రూమ్ కూడా ఏర్పటు అయ్యిందట.ట్విట్టర్,  వాట్సప్,  ఫేస్ బుక్  తదితర సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం ల పై కుమ్మరి శ్రీకాంత్ పనిచేస్తున్నారట .2012 నుంచి కాంగ్రెస్ కు వివిధ రాష్ట్రాల్లో పార్ట్ టైం వ్యూహకర్త గా శ్రీకాంత్ పనిచేశారట.కానీ ఎనిమిది మాసాలుగా తెలంగాణ కాంగ్రెస్ కు పని చేస్తున్నారట.

Telugu Aicc, Pcc Telangana, Sunil Kanugolu, Telangana-Politics

హైదరాబాద్ కు చెందిన శ్రీకాంత్ తెలుగు రాష్ట్రాలలోని రాజకీయాలపై బాగా పట్టు ఉండడంతో తెలంగాణలో కాంగ్రెస్ కు బాగా కలిసి వస్తోందట.దీంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరితోనూ శ్రీకాంత్ టచ్ లో ఉంటూ వారి వారి నియోజకవర్గాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను గురించి వివరిస్తూ,  అక్కడ పై చేయి సాధించేందుకు ఏం చేయాలని వాటిపైన సలహాలు ఇస్తుండడంతో,  శ్రీకాంత్ పై కాంగ్రెస్ సీనియర్ నాయకులతో పాటు,  మిగతా నేతలు కూడా సానుకూలంగానే ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube