దేశవాళి క్రికెట్ లో సరికొత్త రూల్స్.. బీసీసీఐ కీలక ప్రకటన..!

ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ టోర్నీ(I PL Tournament)లో బీసీసీఐ ఓ కొత్త రూల్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.అదే ఇంపాక్ట్ ప్లేయర్ విధానం.

ఇది సక్సెస్ కావడంతో, ఈ రూల్ ను సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ప్రవేశ పెట్టేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.ఈ రూల్ తో పాటు మరొక సరికొత్త రూల్ ను ఈ టోర్నీ లో పరిచయం చేయనుంది.

ఇప్పటివరకు టీ20 క్రికెట్లో ఓవర్ కు ఒకే బౌన్సర్ మాత్రమే వేసే ఛాన్స్ పేస్ బౌలర్లకు ఉంది.ఈ విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఇంపాక్ట్ రూల్ సక్సెస్ కావడంతో బీసీసీఐ ఒక ఓవర్ లో రెండు బౌన్సర్లు వేసేలా కొత్త నియమ నిబంధనలను అమలుపరిచే ఆలోచనలో ఉంది.

Advertisement

తాజాగా శుక్రవారం ముంబాయి( Mumbai)లో జరిగిన అపెక్స్ కమిటీ మీటింగ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్( Impact Player Rule ) తో పాటు రెండు బౌన్సర్లకు సంబంధించిన రూల్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ( Syed Mushtaq Ali Trophy )లో ప్రవేశ పెట్టేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది.

ఈ ఏడాది జరుగనున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఈ రెండు కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టి, ఈ రెండు రూల్స్ సక్సెస్ అయితే మిగిలిన దేశవాళీ టోర్నీలో ఈ రూల్స్ కొనసాగించనున్నట్లు తెలిసింది.బీసీసీఐ రెండు బౌన్సర్ల రూల్ తీసుకురావడానికి ప్రత్యేక కారణం ఏమిటంటే టీ20 ల్లో ఆధిపత్యం బ్యాటర్లకే ఎక్కువగా ఉంటుంది.కాబట్టి ఈ రూల్ తో బౌలర్ల ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది.ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ రూల్స్ ప్రవేశపెడుతున్నట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.2023-24 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 6 వరకు జరుగనుంది.ఈ టోర్నీలో ఏకంగా 38 టీంలు పాల్గొననున్నాయి.

Advertisement

తాజా వార్తలు