కొత్త స్కీమ్ : నెలకు వంద కడితే... మూడువేల పెన్షన్ !

నెలకు వంద రూపాయలు కడితే అరవై ఏళ్ళ తర్వాత మూడువేల పెన్షన్ అందించేలా .

కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకానికి తుది మెరుగులు దిద్దింది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్‌ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌లో అసంఘటిత రంగ కార్మికులకు ఈ కొత్త పింఛన్‌ పథకాన్ని ప్రకటించారు.ప్రధాన మంత్రి శ్రమయోగి మాంధన్‌ పేరుతో ఈ పథకంలో 60 ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా 3వేలు పింఛన్‌ వచ్చే విధంగా రూపొందించారు.

New Pention Scheme Announced By Centrel Goivernment

నెలసరి ఆదాయం 15వేల లోపు ఉండే వారు 29 ఏళ్ల వయస్సులో ఈ పథకంలో చేరితే 60 ఏళ్లు వచ్చే వరకూ వారు నెలకు 100 కట్టాల్సి ఉంటుంది.18 ఏళ్లకే చేరితే నెలకు 55 చెల్లిస్తే 60ఏళ్ల తర్వాత 3వేల పింఛన్‌ అందుతుంది.అసంఘటిత రంగంలోని 10 కోట్ల కార్మికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.

కార్మికులు కట్టిన ప్రీమియంకు సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి నెలా వారి పింఛను ఖాతాలలో జమ చేస్తుంది.ఈ పథకానికి ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది.

Advertisement
New Pention Scheme Announced By Centrel Goivernment-కొత్త స్క�
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నడవడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?
Advertisement

తాజా వార్తలు