ఏపీలో మొదలైన కొత్త పంచాయతీ.. టీచర్లు వర్సెస్ అధికారులు.. !!

ఏపీలో మరో కొత్త పంచాయితీ మొదలైందట.ఈ పంచాయితీ రాజకీయ నాయకుల మధ్య కాదట.

మరెవరి మధ్య అని అనుకుంటున్నారా.ఏపీ అధికారుల మధ్య అక్కడి ప్రభుత్వ టీచర్ల మధ్య.

ఇంతకు ఏం జరిగిందంటే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా టీచర్ల బదిలీలను భారీ ఎత్తున చేపట్టింది.కాగా అప్పటి వరకు ఈ బదిలీల కోసమే ఉపాధ్యాయ సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టాయి.

తాజాగా ఈ బదిలీలతో ఉపాధ్యాయుల్లో ఆందోళన తగ్గగా మరో కొత్త సమస్య తలెత్తింది.వారు కోరిన చోటుకు బదిలీ కావాలి, తాము ఎప్పుడు కోరుకుంటే అప్పుడే ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్‌ ఇవ్వాలి అనే కోరికలు కోరుకుంటున్నారట.

Advertisement

అందుకే బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినా, వారిలో సన్నాయి రాగాలు ఆగలేదు సరికదా అసంతృప్తిగా ఉన్నారట.మరి కొందరైతే సంక్రాంతి సందర్భంగా అంతా పండగ హడావుడిలో ఉంటే బదిలీ ఉత్తర్వులు ఇస్తే ఎలా అని తెగ ఫీలైపోతున్నారట.

అయితే అధికారుల వాదన మాత్రం వేరేలా ఉంది.మొత్తానికి ఈ ఘటన పై ఏపీ సచివాలయ వర్గాల్లో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోందట.

Advertisement

తాజా వార్తలు