వీడియో వైరల్: మండే ఎండల నుంచి రిలాక్స్ కావాలంటే ఇంటిని ఇలా చేసుకుంటేపోలే..

ప్రస్తుతం ఎండలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఉదయం 8 గంటలు దాటితే చాలు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

ఇప్పటికే ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రభావాన్ని ప్రజలపై చూపిస్తున్నాడు.ఈ కారణంగా ఎండ వేడిమిని( Suns Heat ) తట్టుకునేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

ఫ్యాన్లు, కూలర్లు, ఎయిర్ కండిషనర్లు ఇలా అనేక వాటితో సూర్యుని వేడిని ఎదుర్కొనేందుకు మరియు ఉపశమనాన్ని అందించడానికి ఇంట్లో అమర్చకుంటున్నారు.తాజాగా ఎండ నుంచి ఎలా తప్పించుకోవాలో తెలిపే ఓ కొత్త వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

ఈ వీడియో వివరాలను పరిశీలిస్తే.

Advertisement

వైరల్‌గా మారిన వీడియోలో, పొలంలో ఉపయోగించే స్పింకర్స్ కు( Sprinklers ) ఇంటికి నీటిని తీసుకువెళ్లే చిన్న పైపులను జత చేయడం చూడవచ్చు.మీరు ఈ వీడియోలోని ఇంటిని చూస్తే, ఇల్లు పెంకులతో నిర్మాణం చేసి ఉంది.ఈ షెల్ పెంకులతో నిర్మాణం చేసిన ఇంటి పైన మొత్తం నీళ్లు( Water ) పడేలా స్పింకర్స్ ను ఉపయోగించారు.

ఇంటి మీద పొడవాటి ప్రదేశం మధ్యలో మొత్తం మూడు స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసి, వాటి నుంచి ఇంటి నలువైపుల నీరు పడేలా, ఇంటి పైభాగం నీళ్లతో తడిసిపోయేలా స్ప్రింక్లర్లు అమర్చారు.ఇంటి పైభాగం చల్లబడడం వల్ల ఇంట్లో ఉన్నవారికి బయట వేడి కనిపించదు.ఈ వైరల్ వీడియోను( Viral Video ) చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

మీకు అలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి.? అని కొందరంటుండగా.మరికొందరైతే ఇలాంటివి మన ఇంట్లో అమర్చి వేసవిలో చల్లగా ఉండేలా చూస్తామని కామెంట్స్ చేస్తున్నారు.

పర్వత సింహంతో పోరాడిన కుక్క.. వీడియో చూస్తే వణుకే..
Advertisement

తాజా వార్తలు