చాణక్యనీతి: ఈ విషయాలను ఇతరులతో పోల్చుకుంటే నిరాశే..

ఆచార్య చాణక్యుడి విధానాలు, ఆలోచనలు.మనిషి అటు సమాజంలో, ఇటు కుటుంబంలో ఎలా మెలగాలో బోధిస్తాయి.

 Never Compare Yourself With Others , Never Compare , Yourself , Others , Poli-TeluguStop.com

ఆచార్య చాణక్యుడు తన విధానాలలో డబ్బు, ఆరోగ్యం, వ్యాపారం, వైవాహిక జీవితం, సమాజం, జీవితంలో విజయం మొదలైన అన్ని విషయాలపై తన అభిప్రాయాన్ని అందించాడు.దీనినే చాణక్య నీతి అని పిలుస్తారు.

ఇది మనిషికి కష్ట సమయాల్లో సరైన సలహా ఇస్తుంది.చాణక్యుడి ఆలోచనలు కొంచెం కఠినంగా అనిపించవచ్చు.

కానీ ఈ కఠినత్వం వెనుక జీవిత సత్యం ఉంది.చాణక్యుడి విధానాలు జీవితంలోని ప్రతి పరీక్షలో సహాయపడతాయి.

ఇప్పుడు మనం ఆచార్య చాణక్యుడి ఆలోచనలలోని మరొక ఆలోచనను గురించి తెలుసుకుందాం.ఆచార్య చాణక్యుడు తెలిపినదాని ప్రకారం మనిషి తన జీవితాన్ని ఎవరితోనూ పోల్చకూడదని చెప్పారు.‘మీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవద్దు.సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ వారివారి సమయాల్లో ప్రకాశిస్తారు.

అని ఆచార్య చాణక్యుడు తెలిపాడు.ఆచార్య చాణక్యుడి ఈ సూచన ద్వారా జీవితాన్ని ఇతరులతో పోల్చుకోకూడదని తెలుస్తోంది.

ఇతరులను చూసి, చాలామంది తమ జీవితాలను పోల్చుకోవడం తరచూ జరుగుతుంది.ఈ పోలిక డబ్బు, ఇల్లు, వృత్తి లేదా దుస్తుల విషయంలో ఉంటుంది.మీరు కూడా వీటి గురించి ఇతరులతో పోల్చుకుంటే వెంటనే ఈ అలవాటును మార్చుకోండి.నిజ జీవితంలో మీరు అనేక రకాల వ్యక్తులు పరిచయం అవుతారు.

అటువంటి పరిస్థితిలో మీ ముందు ఉన్న వ్యక్తికి ఏ తరహాకు చెందినవారైనా కావచ్చు.వారితో మిమ్మల్ని పోల్చుకోకండి.

ఇతరుల జీవనశైలితో మిమ్మల్ని మీరు ఎప్పుడూ పోల్చుకోకండి.ఇది మీకు ప్రమాదకరం.

ఇలా చేయడం వల్ల మీరు అసూయకు గురవుతారు.దీనితో మిమ్మల్నిమీరు అశాంతిలోకి నెట్టివేసుకునే బదులు సంతోషకరమైన జీవితాన్ని గడపడం ఉత్తమం.

ఆకాశంలో చంద్రుడు, సూర్యుని వేర్వేరు సమయాల్లో ప్రకాశిస్తున్నట్లుగానే అందరి విషయంలో ప్రకాశం భిన్నంగా ఉంటుంది.జీవితంలో అన్నీ సమకూరాలంటే అందుకు కాస్త ఓపిక పట్టాలని ఆచార్య చాణక్య తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube