మరోసారి హిందువుల మనోభావాలు టచ్ చేసిన సైఫ్ అలీఖాన్

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా సన్నివేశాలని దర్శకులు డిజైన్ చేస్తున్నారు.హిందుత్వాన్ని, హిందూ దేవతలని అదే పనిగా అవమానిస్తున్నారు.

అమీర్ ఖాన్ పీకే సినిమా కథాంశంలో మెజారిటీ భాగం హిందువుల సంప్రదాయాలు, నమ్మకాలని అవహేళన చేసే విధంగా ఉంటుంది.దర్శకులని, నటులకి ఇండియాలో హిందుత్వం టార్గెట్ అయ్యేంతగా ఇతర మాత విశ్వాసాలు టార్గెట్ కావు.

వాటిని టచ్ చేసే ప్రయత్నం కూడా చేయరు.ఇంతగా అవమానించిన ఎవరో కొన్ని హిందుత్వ సంస్థలు తప్ప ప్రజలు పెద్దగా రియాక్ట్ కారనే ఉద్దేశ్యంతోనే వారు ఇలా చేస్తున్నారని కొంత మంది వాదన.

ఇదిలా ఉంటే ఆది పురుష్ సినిమాలో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో కనిపించబోతున్నాడు.ఈ సినిమా గురించి చెప్పే క్రమంలో ఆది పురుష్ కథలో రాముడు గొప్పతనంతో పాటు రావణుడు గొప్పతనాన్ని, అతనిలో పాజిటివ్ కోణాన్ని ఆవిష్కరించి హీరోగా చూపించబోతున్నారని చెప్పడం ద్వారా వివాదాన్ని రాజేసి హిందువుల ఆగ్రహానికి గురయ్యారు.

Advertisement

తరువాత క్షమాపణలు చెప్పుకున్నారు.

ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ లో కూడా అలాగే హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా సన్నివేశాలు చేసి మరోసారి సైఫ్ అలీఖాన్ చేశారు.సైఫ్ అలీఖాన్ నటించిన తాండవ్ అనే వెబ్ సిరీస్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఈ వెబ్ సిరీస్ లో హిందూ దేవుళ్లను కించపరుస్తూ మనోభావాల్ని దెబ్బ తీసేలా ఈ సిరీస్ లో కొన్ని సన్నివేశాలున్నాయని, హిందూ దేవుళ్ళను ఎగతాళి చేస్తూ దారుణంగా చూపించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొన్ని దృశ్యాలు అభ్యంతరకరంగా, నీచంగా ఉన్నాయని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.కొంతమంది రాజకీయ నాయకులు కూడా తాండవ్ లోని సన్నివేశాలపై తమ అసమ్మతిని వ్యక్తం చేశారు.రాముడు, శివుడి భక్తుల మనోభావాల్ని కించపరిచే సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ వెబ్ సిరీస్ కి నెగిటివ్ టాక్ రావడంతో మేకర్స్ ఈ విధమైన పబ్లిసిటీని చేస్తున్నారని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారు.

వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

Advertisement

తాజా వార్తలు