బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, హీరోయిన్ ప్రియమణి ( , Ajay Devgn)ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం మైదాన్( Maidaan ).తాజాగా ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
అమిత్ శర్మ డైరెక్షన్ లో తెరకెక్కించారు.విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా చూసేందుకు మైదాన్ నిర్మాతల్లో ఒకరైన బోనీ కపూర్ థియేటర్ కు వచ్చారు.
అదే సమయంలో హీరోయిన్ ప్రియమణి తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు.
ఈ క్రమంలోనే బోనీ కపూర్( Boney Kapoor ) వ్యవహరించిన తీరుపై ప్రస్తుతం నెటిజన్స్ మండి పడుతున్నారు.ప్రియమణి నడుముపై చేతులు వేస్తూ కనిపించారు.అంతే కాకుండా ఎలా పడితే అలా తాకుతూ ప్రియమణిని ఇబ్బందికి గురిచేశారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాల్ప్ వైరల్ కావడంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.68 ఏళ్ల వయసులో ఉన్న ప్రముఖ నిర్మాత అసభ్యకరంగా వ్యవహరించడాన్ని తప్పుబడుతున్నారు.ఆ వీడియో పై నెటిజన్స్ స్పందిస్తూ ప్రియమణితో అలా వ్యవహరించడం చాలా అసహ్యంగా ఉంది.
ఏమీ బాగోలేదు.ఒక మంచి స్థానంలో ఉండి మీరు అలా వ్యవహరించడం ఏంటి మీకు కూడా కూతుర్లు ఉన్నారు కదా అంటూ మండిపడుతున్నారు.మరొక నెటిజన్ కామెంట్ చేస్తూ.
మీకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని గుర్తుంచుకోవాలి.ఇలా ప్రవర్తించడం చాలా అవమానకరంగా ఉంది అని పోస్ట్ చేశారు.
అయితే బోనీ కపూర్ ఇలా వ్యవహరించడం ఇదేం మొదటిసారి కాదు.గతంలో కూడా పలుసార్లు ఈ విధంగా వ్యవహరించి ఆయన సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కి కూడా గురయ్యారు.