Oppenheimer : శృంగారం చేస్తూ భగవద్గీత చదివిన హీరో.. ఆ హీరోకు నెటిజన్లు ఎలా షాకిచ్చారంటే?

అమెరికా శాస్త్రవేత్త రాబర్ట్ ఒప్పెన్ హైమర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఒప్పెన్ హైమర్( Oppenheimer ).

ఈ సినిమా ఇటీవల జులై 21న విడుదల అయింది.

ఇంటర్‌స్టెల్లార్ ఇన్‌సెప్షన్, డంకిర్క్ వంటి గొప్ప చిత్రాలను అందించిన ప్రముఖ అమెరికన్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమాకు డైరక్టర్ గా వ్యవహరించారు.ఇందులో ప్రముఖ హాలీవుడు నటుడు సిలియన్ మర్ఫీ రాబర్ట్( Cillian Murphy ) ఓపెన్‌ హైమర్ పాత్రలో నటించారు.

ఓపెన్‌హైమర్ ప్ర‌మోష‌న్ లలో భాగంగా ఒక ఇంట‌ర్వ్యూలో హీరో సిలియ‌న్ మ‌ర్ఫీ భ‌గ‌వ‌ద్గీత ప్ర‌స్తావ‌న తేవ‌డం, అందులోని కొన్ని లైన్స్ చెప్ప‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

అయితే తాజాగా విడుదల అయిన ఈ సినిమాలో ఒక స‌న్నివేశం హిందువుల మనోభావాలను దెబ్బతీసింది.సిలియన్ మర్ఫీ క్యారెక్టర్ ఫ్లోరెన్స్ పగ్స్‌ తో శృంగారం చేస్తున్నప్పుడు భగవద్గీత( Bhagavad Gita )ను చదవడమే ఇందుకు కారణం.సంస్కృతంలో ఉన్న భ‌గ‌వ‌ద్గీత‌ను హీరోయిన్ లలో ఒక‌రు హీరో ఇంట్లో చూసి అది చ‌ద‌వ‌మ‌ని అన‌డం అత‌ను ఆ భాష తెలియ‌క‌పోయినా భావం తెలుసంటూ ఇందులో శ్రీకృష్ణుడు( ord Srikrishna ) చెప్పిన‌ట్లుగా And now I am become death.

Advertisement

Destroyer of worlds అనే వాక్యాన్ని ఉచ్ఛ‌రించాడు.

దీంతో అదేమైనా షేక్స్పియర్ నవలా శృంగారం చేస్తూ చదవడానికి,అది భగవద్గీత హిందువుల పవిత్ర గ్రంథం అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు.ఈ సినిమాకు సెన్సార్ బోర్డు( Censor Board ) సర్టిఫికేట్ అందించడం పైన కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మరి ఈ విషయంపై హీరో డైరెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.మరి ఆ సన్నీవేశాన్ని డిలీట్ చేస్తారా లేదంటే క్షమాపణలు చెబుతారా అన్నది చూడాలి.

Advertisement

తాజా వార్తలు