కమల్ హాసన్, మమ్ముట్టి లని చూసి నేర్చుకోండి అంటున్న నెటిజన్స్...

మాములుగా ఏ వృత్తిలో ఉన్న వారు అయిన సడన్ ఒక స్టేజి వరకు మాత్రమే పని చేస్తారు ఆ ఏజ్ దాటింది అంటే అసలు పని చేయాలన్న వాళ్ళ ఏజ్ సహకరించదు కాబట్టి 60 దాటినా ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ ఇచ్చేసి ఇంట్లో కూర్చోబెడతారు వాళ్ళు ఏం పని చేయలేరు కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది అయితే ఇప్పటి దాక మనం మాట్లాడుకుంది అన్ని ఫీల్డ్స్ లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి కానీ ఇక్కడ మనం ప్రత్యేకం గా చెప్పుకునేది సినిమా ఫీల్డ్ గురించి ఈ ఫీల్డ్ లో అసలు రిటైర్మెంట్ అనేదే లేదు.సరే రిటైర్మెంట్ లేకున్నా పర్లేదు కానీ 60 లో కూడా మన హీరోలు 20 లో ఉన్న హీరో క్యారెక్టర్స్ చేస్తేనే జనాలు చూడడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లకి ఆల్రెడీ 60 దాటిపోయాయి అయిన కూడా వీళ్ళు యంగ్ హీరోయిన్స్ తో నటించడం, రొమాన్స్ చేయడం ఇవన్నీ చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది దింట్లో ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ( Chiranjeevi Balakrishna ) అయితే పోటీ పడి మరి యంగ్ హీరోయిన్స్ తో నటిస్తున్నారు.టెక్నాలజీ ని వాడి వాళ్ళ ఏజ్ తగ్గించినప్పటికీ అది ఆర్టిఫిషల్ గా ఉంటుందే తప్ప నాచురల్ గా ఉండడం లేదు.రవి తేజ( Raviteja ) ఏజ్ కూడా ఆల్మోస్ట్ 60 కి దగ్గరగా ఉంది అయినప్పటికీ కూడా 20 ఏళ్ళు కూడా నిండని శ్రీలీల తో రొమాన్స్ చేయడం చూసి జనాలు విపరీతమైన ట్రోలింగ్ చేసారు.

ధమాకా సినిమాలో రవితేజ హీరో శ్రీలీల హీరోయిన్ గా చేశారు ఒక రకం గా వీళ్ళు స్క్రీన్ మీద బాగానే కనిపించినప్పటికీ ఆడియన్స్ లో ఏదో తెలియని ఒక అసంతృప్తి లా మిగిలిపోయింది వీళ్ళ జంట.

ఇది ఇలా ఉంటె కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలకి కూడా హీరోయిన్స్ ప్రాబ్లెమ్ ఉంది.అయితే ఇది గమనించిన కమల్ హాసన్( Kamal Haasan ) విక్రమ్ లాంటి సినిమా తీసి మంచి విజయాన్నిఅందుకున్నాడు.అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ తాత పాత్రలో తన మనవడిని కాపాడుకునే క్రమంలో విల్లన్స్ తో ఫైట్ చేయడం అవన్నీ కూడా తన ఏజ్ గ్రూప్ కి సరిపడా పాత్రలో చేసాడు కాబట్టి జనం కూడా ఆ సినిమా ని ఆదరించారు.

Advertisement

ఇలాంటి పాత్రలు చేయాలి కానీ ముఖానికి కృత్రిమంగా ఎఫెక్ట్స్ ఆడ్ చేసి ఎన్ని జిమ్మిక్కులు చేసిన అది వర్క్ అవుట్ కాదు మళయాళం లో మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి వారు వారి ఏజ్ కి తగ్గ పాత్రలు చేస్తున్నారు.భీష్మ పర్వం మూవీ లో మమ్ముట్టి( Mammooty ) ఒక డాన్ గా కనిపించినప్పటికీ ఆయన ఏజ్ కి ఆ పాత్ర బాగా సెట్ అయింది.

తెలుగులో మన సీనియర్ హీరోలు కూడా ఇలాంటి పాత్రలు చేస్తే చూడాలి అని జనాలు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు