శివాజీ లేకపోతే బిగ్ బాస్ సీజన్7 అట్టర్ ఫ్లాప్.. ఇంతకు మించి సాక్ష్యం కావాలా అంటూ?

బిగ్ బాస్ షో సీజన్7( Bigg Boss Show Season 7 ) గత సీజన్లతో పోల్చి చూస్తే ఒకింత సక్సెస్ కావడానికి శివాజీ కారణమని చాలామంది భావిస్తున్నారు.

బిగ్ బాస్ షో సీజన్7 సక్సెస్ కు నాగార్జున కంటే శివాజీ కారణమని ఎక్కువమంది ఫీలవుతున్నారు.

సోషల్ మీడియాలో శివాజీకి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.శివాజీపై ఎవరైనా నెగిటివ్ కామెంట్లు చేసినా ఆయన అభిమానులు అస్సలు అంగీకరించడం లేదు.

శివాజీ లేకపోతే బిగ్ బాస్ సీజన్7 అట్టర్ ఫ్లాప్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

కొన్నిరోజుల క్రితం ఆరోగ్య సమస్యల వల్ల బిగ్ బాస్ షో నుంచి శివాజీని ఎలిమినేట్ చేశారని ప్రచారం జరగగా ఆ సమయంలో చాలామంది సోషల్ మీడియాలో శివాజీ లేకపోతే బిగ్ బాస్ షో చూడబోమని కామెంట్లు చేశారు. శివాజీ( shivaji ) క్రేజ్ కు ఇంతకుమించి సాక్ష్యం కావాలా అని నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.శివాజీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Advertisement

మరోవైపు శివాజీ నటించిన ఒక వెబ్ మూవీ సంక్రాంతి కానుకగా ఈటీవీ విన్ లో ప్రసారం కానుంది.నైంటీస్( 90s Web series ) పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.శివాజీ భార్య పాత్రలో వాసుకి నటించారు.

మిడిల్ క్లాస్ బయోపిక్ గా ఈ వెబ్ మూవీ తెరకెక్కడం గమనార్హం.బిగ్ బాస్ షోకు కూడా శివాజీ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది.

వారానికి 4 లక్షల రూపాయల రేజ్ లో శివాజీ పారితోషికం ఉంది.శివాజీ బిగ్ బాస్ షోకు ప్లస్ అయ్యారనే చెప్పాలి.కొన్ని మీడియా ఛానెళ్లు శివాజీ గురించి పనిగట్టుకుని నెగిటివ్ ప్రచారం చేస్తున్నా శివాజీ మాత్రం మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.2024 ఎన్నికల్లో శివాజీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు