గతేడాది థియేటర్లలో విడుదలైన స్కంద మూవీ( Skanda Movie ) బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది.శ్రీలీల( Sreeleela ) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమా ఆమెకు నెగిటివ్ అయింది.
అయితే తాజాగా కృతిశెట్టి( Krithi Shetty ) ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లగా అక్కడ ఒక అభిమాని కృతిశెట్టితో స్కంద మూవీ సూపర్ ఉందని కామెంట్ చేయగా షాకవ్వడం కృతిశెట్టి వంతైంది.అయితే కృతిశెట్టి వెంటనే తేరుకుని స్కంద మూవీ సూపర్ ఉందని అయితే అందులో నేను యాక్ట్ చేయలేదని అన్నారు.
కృతిశెట్టి ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర భాషల్లో పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.ఆమె పారితోషికం కూడా తక్కువగానే ఉంది.కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకున్న కృతిశెట్టి తర్వాత రోజుల్లో కెరీర్ పరంగా తప్పటడుగులు వేయడం ఆమెకు మైనస్ అయింది.బంగార్రాజు( Bangarraju ) తర్వాత కృతిశెట్టి నటించిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఫెయిల్ కావడం గమనార్హం.
కృతిశెట్టి ప్రస్తుతం ఇతర భాషల ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెట్టగా అక్కడ ఆమెకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాల్సి ఉంది.కృతిశెట్టి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మాత్రమే ఆమె కెరీర్ పుంజుకునే అవకాశాలు ఉంటాయి.కృతిశెట్టికి సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్( Fan Following ) పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.కృతిశెట్టికి తెలుగులో ఆఫర్లు ఇచ్చే హీరోలెవరో చూడాల్సి ఉంది.
కృతిశెట్టి కథల ఎంపికలో తప్పులు చేయడం వల్లే ఆమెకు ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే.మరో హీరోయిన్ శ్రీలీలకు సైతం తెలుగులో ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే.కృతిశెట్టి, శ్రీలీల లాంటి హీరోయిన్లు ఇష్టానుసారం ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే ఆయా హీరోయిన్ల కెరీర్ ప్రమాదంలో పడింది.2024 సంవత్సరం ఈ స్టార్ హీరోయిన్లకు కలిసొస్తుందేమో చూడాల్సి ఉంది.