సినిమాలో పాటలు పాడిన డబ్బులు ఇవ్వరు అంటున్న స్టార్ సింగర్

సినిమా ఇండస్ట్రీలో కొంత మంది పని చేయించుకొని క్రెడిట్ ఇవ్వకుండా మోసం చేస్తూ ఉంటారు.అలాగే కొంత మంది క్రెడిట్ ఇచ్చిన రెమ్యునరేషన్ ఇవ్వరు.

ఇలాంటి పరిస్థితి రచయితల నుంచి సింగర్స్ వరకు చాలా మందికి ఎదురవుతూ ఉంటుంది.కెరియర్ కొత్తలో ఇలాంటి అనుభవాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

అయితే బాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చిన సింగర్స్ కూడా కనీసం ఎలాంటి పేమెంట్ తీసుకోకుండా పాటలు పాడుతారని స్టార్ సింగర్ నేహా కక్కర్ అంటుంది.తాను ఇప్పటి వరకు సినిమాలలో పాడిన పాటలకి ఒక్క పైసా కూడా ఏ సంగీత దర్శకులు ఇవ్వలేదని చెబుతుంది.

సినిమాల్లో ఉచితంగానే పాట‌లు పాడ‌తానంటోంది.అయితే బాలీవుడ్ లో ఇంచు మించి గాయకుల అందరి పరిస్థితి ఇలాగే ఉంటుందని.

Advertisement

నేహా కక్కర్ చెప్పడం ఇప్పుడు బీటౌన్ లో సంచలనంగా మారింది.ఓ గ‌ర్మీ, ఆంఖ్ మేరే, సాఖి, దిల్‌బ‌ర్ రీమిక్స్‌, కాలా చ‌ష్మా వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ పాట‌ల‌తో ఈమె బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే తాను పాడిన సినిమాల ద్వారా ఆదాయం రాకపోయినా లైవ్ ఈవెంట్స్, కన్సర్ట్ లతో మంచి ఆదాయం వస్తుందని, తాను ఇలా లైవ్ షోల ద్వారానే ఆదాయం సంపాదించుకున్న అని చెప్పుకొచ్చింది.లైవ్ షోలు అవకాశం రానివారు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారని నేహా కక్కర్ చెప్పడం గమనార్హం.

మొత్తానికి ఇండస్ట్రీలో సింగర్ అనేది ఫుల్ టైం కెరియర్ కాదని ఈ భామ చెప్పిన మాటలు బట్టి అర్ధమవుతుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీ కి టాలీవుడ్ భారీ పోటీ ఇస్తుందా..?ఇక అందులో నలుగురి స్టార్ హీరోల పాత్ర ఉందా..?
Advertisement

తాజా వార్తలు