గర్భా స్టెప్పులతో అదరగొట్టిన 'నీరజ్ చోప్రా'.. వైరల్ అవుతున్న వీడియో!

ఇండియాలో నీరజ్ చోప్రా అనే అతను ఓ సెలిబ్రిటీ ఇపుడు.అవును, నీరజ్ అనగా ఇపుడు అందరికీ గుర్తొచ్చేది భారత స్టార్ జావెలిన్ త్రోయర్.

 Neeraj Chopra Garbha Dance Video Viral On Social Media Details, Garba Dance, Per-TeluguStop.com

తాజాగా అతను గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర‌లో జరిగిన దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో పాల్గొన్నాడు.ఈ సందర్భంగా నీరజ్ చోప్రా గర్భా డ్యాన్స్ తో అదరగొట్టాడు.

ముందుగా గ‌ర్భా వేదిక వ‌ద్ద అతను ప్రత్యేక పూజలు చేశాడు.అనంతరం తన అభిమానులు, అక్కడికి తరలి వచ్చిన పెద్దలతో కలిసి గుజరాత్ సంప్రదాయ నృత్యం అయినటువంటి గర్భా డ్యాన్స్‌ వేశాడు.

ఇకపోతే నీరజ్ చోప్రా చాలా రోజుల కిందటే స్వస్థలం అయినటువంటి బరోడాకు వెళ్లాడు.ఈ సందర్భంగా ఫ్యాన్స్ అతనికి ఘనస్వాగతం పలికారు.నీరజ్ చోప్రా గర్బా డ్రెస్ వేసుకుని నవరాత్రి సెలబ్రేషన్స్‌లో పాల్గోవడం ఇక్కడ వీడియోలో మనం చూడవచ్చును.నీరజ్ చోప్రాను చూసిన అభిమాన జనాలు నీరజ్ భాయ్… నీరజ్ భాయ్… అంటూ నినాదాలు చేశారు.

ఆ త‌ర్వాత కొంత మంది స‌భ్యుల‌తో క‌లిసి గ‌ర్భా నృత్యాన్ని చేశాడు.టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా… డైమండ్‌ లీగ్‌ టైటిల్‌ను దక్కించుకున్న విషయం తెలిసినదే.

ఈ క్రమంలో డైమండ్ లీగ్ ఫైనల్స్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడిగా నీరజ్ చరిత్ర సృష్టించాడు.ఆ తర్వాత వెకేషన్‌ కోసం స్విట్జర్లాండ్‌కు వెళ్లి.అక్కడ స్కైడైవిండ్ చేసి జనాలను ఆకట్టుకున్నాడు.గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర‌లో జ‌రిగిన ఈవెంట్‌లో ఆయ‌న డాన్స్ వేయడంతో సదరు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అతను అక్కడ స్టేజ్ మీద‌కు వెళ్లిన స‌మ‌యంలో జ‌నం భారీగా నినాదాలు చేశారు.ఇటీవ‌ల జ‌రిగిన ప‌లు ఈవెంట్ల‌లోనూ నీర‌జ్ ప‌త‌కాలు గెలిచిన విష‌యం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube