న్యూయార్క్ నుంచి కాంగ్రెస్ బరిలో నిలిచిన భారత సంతతి వ్యక్తికి కరోనా

అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే అక్కడ వేలాది మంది జనం పిట్టల్లా రాలిపోతున్నారు.

సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కరోనా సోకడంతో ఆసుపత్రికి పరిగెడుతున్నారు.తాజాగా డెమొక్రాటిక్ ప్రైమరీలో న్యూయార్క్ 12వ కాంగ్రెషనల్ సీటు కోసం బరిలో నిలిచిన భారత సంతతికి చెందిన సూరజ్ పటేల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.

ఈ సంగతిని ఆయన సోషల్ మీడియాతో పాటు బ్లాగ్ ద్వారా తెలియజేశారు.న్యూయార్క్‌లోని 12

కాంగ్రెషనల్

స్థానంలో ఇప్పటికే ఆ పదవిలో ఉన్న కరోలిన్ మలోని స్థానాన్ని కైవసం చేసుకునేందుకు సూరజ్ డెమొక్రాటిక్ పార్టీ ప్రైమరీలో పోటీ పడుతున్నారు.10 రోజుల క్రితం తనకు ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, 102 డిగ్రీల జ్వరం వచ్చిందని ఆయన తన ప్రకటనలో తెలిపాడు.తాను ప్రస్తుతం ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో ఇంట్లోనే ఉన్నానని సూరజ్ చెప్పారు.

తనతో పాటు తన కుటుంబసభ్యులు కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని, తిరిగి కోలుకునే వరకు తాము స్వీయ నిర్బంధంలో ఉంటామని ఆయన వెల్లడించారు.

Advertisement

2008 నవంబర్‌ ఎన్నికల సమయంలో సూరజ్ పటేల్ నాటి అమెరికా అధ్యక్షుడు

బరాక్ ఒబామా

ప్రచార బృందంలో పనిచేశారు.సూరజ్ పటేల్ కాంగ్రెషనల్ స్థానం కోసం బరిలోకి దిగడం ఇది రెండవసారి.స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్ డిగ్రీ, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంంలో మాస్టర్స్ డిగ్రీ,

న్యూయార్క్ వర్సిటీ స్కూల్ ఆఫ్ లా గ్రాడ్యుయేట్స్‌

లలో సూరజ్ ఉన్నత విద్యను అభ్యసించాడు.

కాగా కరోనా దెబ్బకు అమెరికాలో పరిస్దితులు విషమంగా మారుతున్నాయి.ఇక్కడ ఇప్పటి వరకు వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 3,400 దాటింది.న్యూయార్క్‌లో కోవిడ్ వ్యాప్తి ఉద్దృతంగా ఉంది.

సోమవారం ఒక్కరోజే ఇక్కడ 250 మంది ప్రాణాలు కోల్పోయారు.

పార్క్‌లో వాకింగ్.. గాయాలతో భారత సంతతి వృద్ధుడు మృతి, ఐదుగురు చిన్నారులు అరెస్ట్.. మిస్టరీ
Advertisement

తాజా వార్తలు