నయనతార పెళ్లి ఖర్చు మొత్తం వారిదేనా.. రూపాయి కూడా ఖర్చు పెట్టని నయన్ విఘ్నేష్?

లేడీ సూపర్ స్టార్ నయనతార తన ప్రేమికుడు విగ్నేష్ ను జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

మహాబలిపురం రిసార్ట్ లో వీరి వివాహం ఎంతో కన్నుల పండుగగా జరిగింది.

అత్యంత సన్నిహితులు సెలబ్రిటీలు సమక్షంలో ఈ జంట ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఇకపోతే గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట చాలా ఘనంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాము అంటూ గతంలో పలు సార్లు వెల్లడించారు.

ఈ క్రమంలోనే నయనతార విగ్నేష్ తమ పెళ్లిని ఎంతో ఘనంగా జరుపుకున్నారు.నయనతార పెళ్లికి జరిగిన ఏర్పాట్లను చూస్తే పెళ్లికి భారీ మొత్తంలో ఖర్చు అయి ఉంటుందనీ తెలుస్తోంది.

భోజనాల నుంచి మొదలుకొని రిసార్ట్ ను అందంగా అలంకరించడంమేకాకుండా అతిథుల కోసం ప్రత్యేకమైన గదులను ఏర్పాటు చేయడం వరకు ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది.అయితే ఇంత ఘనంగా నయనతార విగ్నేష్ పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ దంపతులు మాత్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదట.

Advertisement
Nayanatara Wedding Expenses Are Spend By They Nayan Vignesh Did Not Even Spend A

వీరి పెళ్లి ఖర్చు మొత్తం ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ ఖర్చు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Nayanatara Wedding Expenses Are Spend By They Nayan Vignesh Did Not Even Spend A

నయనతార విగ్నేష్ వివాహ వేడుకను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేయడంతో వీరి వివాహ ఖర్చును కూడా నెట్ ఫ్లిక్స్ పెట్టుకున్నట్లు సమాచారం.దాదాపు 25 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వీరి పెళ్లి ఎంతో ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తోంది.పెళ్లి కోసం మేకప్ ఆర్టిస్ట్ ల నుంచి సెక్యూరిటీ సిబ్బంది వరకు ముంబై నుంచి ప్రత్యేకంగా రప్పించి ఎన్నో కట్టుదిట్టమైన భద్రత నడుమ వీరి వివాహం జరిపించారు.

ఇక వీరి వివాహ వేడుకను ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ పర్యవేక్షణలో చిత్రీకరించడం విశేషం.అందుకే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు పడ్డారు.

ఇకపోతే త్వరలోనే నయనతార విగ్నేష్ పెళ్లి వేడుక నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతుందని తెలుస్తోంది.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?
Advertisement

తాజా వార్తలు