కులదైవం సన్నదిలో సందడి చేసిన నయన్ దంపతులు... ఫోటోలు వైరల్!

సౌత్ ఇండస్ట్రీలో అగ్రతారక ఎంతో గుర్తింపు సంపాదించుకున్న నయనతార (Nayanatara) గత ఏడాది జూన్ 9వ తేదీ డైరెక్టర్ విగ్నేష్ శివన్(Vignesh Shivan) ను వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా వీరి వివాహం తర్వాత నాలుగు నెలలకే పండంటి కవల పిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చారు.

అయితే పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా పిల్లలకు జన్మనివ్వడంతో అప్పట్లో ఇది కాస్త పెద్ద వివాదంగా మారింది.అయితే ఈ వివాదానికి నయనతార దంపతులు పూర్తి వివరణ ఇచ్చుకున్నారు.

ఇటీవల ఒక అవార్డు వేడుకలలో పాల్గొన్నటువంటి నయనతార తన పిల్లల పూర్తి పేర్లను తెలియజేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే తాజాగా నయనతార విగ్నేష్ దంపతులు తన కులదైవాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బుధవారం ఉదయం తంజావూర్‌ జిల్లా పాపనాశం సమీపంలోని కులదైవం మేలవళత్తూర్‌ ఆట్రంగరై శ్రీ కాంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.

Advertisement

తమ పిల్లల ఆరోగ్యం శ్రేయస్సు కోసం అలాగే తమ చిత్రాల విజయాల కోసం ఈ దంపతులు ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించినట్టు తెలుస్తుంది.

ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే వివాహం తర్వాత ఈమె డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తో కలిసి జవాన్(Jawan) సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది.ఈ సినిమా ద్వారా నయనతార బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు.

ఈ సినిమా కోసం ఈమె ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం.

'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 
Advertisement

తాజా వార్తలు