యాక్సిడెంట్ తో గాయాలు... టాలీవుడ్ హీరో పోస్ట్ వైరల్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా పలు చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న వారిలో నటుడు నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty ) ఒకరు.ఈయన హీరోగా ఇదివరకు ఎన్నో సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు ఇక చివరిగా నవీన్ పోలిశెట్టి అనుష్క( Anushka ) హీరో హీరోయిన్లు నటించిన మిస్టర్ శెట్టి మిస్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించారు ఈ సినిమా తర్వాత ఈ అన్న తదుపరి ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు అంతేకాకుండా ఇటీవల కాలంలో సోషల్ మీడియాకి కూడా పూర్తిగా దూరంగా ఉంటున్నారు.

ఇలా నవీన్ పోలిశెట్టి సోషల్ మీడియాలో లేకపోవడం అదే విధంగా ఇతర సినిమాలను కూడా ప్రకటించకపోవడంతో అసలు ఈయన ఎక్కడున్నారు అన్న సందేహాలు కూడా అందరికీ కలుగుతున్నాయి.అయితే నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం అమెరికాలో( America ) ఉన్నారని, నాకు యాక్సిడెంట్( Accident ) కావడంతోనే అమెరికాలోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని తెలుస్తుంది.అయితే తాజాగా తన హెల్త్ అప్డేట్ గురించి ఈయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

యాక్సిడెంట్ కారణంగా తన చేతికి పలుచోట్ల ఫ్రాక్చర్ అయిందని నవీన్ పోలిశెట్టి తెలిపారు.కాలికి కూడా బాగా గాయమైందని చాలా కష్టంగా ఉందని తెలిపారు.అయితే ఈ గాయాల నుంచి పూర్తిగా కోలుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను మీ ప్రేమ మద్దతు మాత్రమే నాకు అవసరమైన ఔషధం.

దయచేసి నేను చెప్పే వాటిని నమ్మండి త్వరలోనే బిగ్ స్క్రీన్ పై మీ ముందుకు వచ్చేస్తాను అంటూ నవీన్ పోలిశెట్టి తన హెల్త్ గురించి అప్డేట్ ఇస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.ఇక నవీన్ పోలిశెట్టి తన హెల్త్ గురించి ఇలాంటి పోస్ట్ చేయడంతో అభిమానులు ఒకసారిగా ఆందోళన చెందుతూ తొందరగా మీరు కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
పబ్లిక్ లో తమను తాము ఎప్పుడూ తక్కువ చేసుకుని మాట్లాడే హీరోలు వీరే !

తాజా వార్తలు