చ‌లికాలంలో చ‌ర్మ స‌మ‌స్య‌లు.. సులువుగా చెక్ పెట్టండిలా?

ప్ర‌స్తుతం శీతాకాలం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ కాలంలో రోగాల‌తో పాటు చ‌ర్మ స‌మ‌స్య‌లు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి.

ముఖ్యంగా చ‌ర్మం పొడి బారిపోవ‌డం, పెలుసుగా మారిపోవ‌డం, ప‌గుళ్లు, రాషెస్, దుర‌ద‌లు, మంట‌లు వంటి స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉంటాయి.అందుకే ఈ సీజ‌న్‌లో కేవ‌లం ఆరోగ్యం విష‌యంలోనే కాకుండా.

స్కిన్ విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త‌లు పాటించాలి.అయితే ఇప్పుడు చెప్పబోయే విష‌యాల‌ను ఫాలో అయితే.

చ‌లికాలంలో వ‌చ్చే చ‌ర్మ స‌మస్య‌ల‌ను సులువుగా నివారించుకోవ‌చ్చు.ఈ వింట‌ర్ సీజ‌న్‌లో చాలా మంది బాగా వేడి వేడిగా ఉండే నీళ్ల‌తో స్నానం చేస్తారు.

Advertisement
Natural Tips To Prevent Skin In Winter Season! Natural Tips, Skin Care, Winter S

కానీ, అలా ఇక‌పై  అస్స‌లు చేయ‌కండి.ఎందుకంటే, బాగా మ‌రిగిన నీళ్ల‌తో బాత్ చేయ‌డం వ‌ల్ల‌.

చ‌ర్మం స‌హ‌జ నూనెల‌ను కోల్పోయి డ్రైగా మారి పోతుంది.అందుకే, గోరు వెచ్చ‌గా ఉండే నీటితో బాత్ చేయాలి.

అలాగే ఈ చ‌లి కాలంలో దాదాపు అంద‌రినీ పొడి చ‌ర్మం తెగ ఇబ్బంది పెడుతుంది.అలాంటి వారు ప్ర‌తి రోజు కొబ్బ‌రి నూనెను నీటిలో క‌లిపి స్నానం చేస్తే.

చ‌ర్మం ఎల్ల‌ప్పుడు తేమ‌గా ఉంటుంది.

Natural Tips To Prevent Skin In Winter Season Natural Tips, Skin Care, Winter S
న్యూస్ రౌండప్ టాప్ 20

ఇక బాత్ చేసిన త‌ర్వాత చ‌ర్మానికి మాయిశ్చరైజర్‌ను త‌ప్ప‌కుండా అప్లై చేసుకోవాలి.అలాగే రాత్రి పడుకునే ముందు కూడా మాయిశ్చరైజర్ చ‌ర్మానికి రాసుకుంటే.ప‌గుళ్లు త‌గ్గి చ‌ర్మం మృదువుగా ఉంటుంది.

Advertisement

అలాగే ఈ వింట‌ర్ సీజ‌న్ చాలా మంది చేసే పొర‌పాటు.నీటిని తాగ‌డం త‌గ్గించ‌డం.

మూత్రం ఎక్కువగా వస్తుందనే కారణంతో కొందరు నీరు తాగ‌డం మానేస్తారు.కానీ, ఏ కాల‌మైన నీరు శ‌రీరానికి స‌ర‌ప‌డా అందించాలి.

అప్పుడు స్కిన్ అందంగా, నిగారింపుగా ఉంటుంది.అదే విధంగా, ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటితో నిమ్మ‌ర‌సం మ‌రియు తేనె క‌లిపి సేవిస్తే.

చ‌ర్మం ప్ర‌కాశ వంతంగా మెరుస్తుంది.అలాగే ప్ర‌తి రోజు స్నానం చేసేందుకు పెస‌ర‌పిండి మ‌రియు పెరుగు రెండింటిని బాగా మిక్స్ చేసి.

చ‌ర్మానికి ప‌ట్టించాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో స్నానం చేస్తే.

చ‌ర్మంపై ఉన్న మ‌లినాలు, మృత క‌ణాలు పోయి అందంగా మారుతుంది.

తాజా వార్తలు