తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లు వాళ్లకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక దానికి తగ్గట్టుగానే వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో వాళ్ళకంటే ఒక ప్రత్యేక గుర్తింపు పొందుతూ ఉంటారు.
ఇక ఇలాంటి క్రమంలోనే సతీష్ వేగేశ్న ( Satish Vegesna )కూడా శతమానం భవతి అనే సినిమాతో తమదైన రీతిలో ఒక మంచి సక్సెస్ ని కొట్టి ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం సినిమాతో( Srinivasa Kalyanam movie )బొక్క బోర్లా పడ్డాడు.
కళ్యాణ్ రామ్( Kalyan Ram ) తో చేసిన ఎంత మంచివాడవు రా సినిమా ఫ్లాప్ అవడంతో ఆయన ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ ఔట్ అయ్యే దశలో ఉన్నాడు.ఈయన చేసిన సినిమాల్లో ఒక శతమానం భవతి సినిమా( Shatamanam Bhavathy movie ) మాత్రమే మంచి విజయాన్ని అందుకొని సూపర్ సక్సెస్ అయినప్పటికీ ఆ తర్వాత ఈయన చేసిన సినిమాలు సక్సెస్ సాధించకపోవడంతో ప్రస్తుతం ఈయన కెరీర్ అనేది డైలమా లో పడింది.ఇక ఈయనకి సినిమా ఇచ్చే హీరో లేడు ఒకవేళ హీరో సినిమా ఇచ్చిన దాన్ని చేసి సక్సెస్ కొట్టేంత సత్తా కూడా ప్రస్తుతం ఆయన దగ్గర లేదని చాలామంది అభిప్రాయ పడుతున్నారు.
ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బామ్మర్ది అయిన నార్నే నితిన్ ని హీరో గా పెట్టి ఒక సినిమా మొదలు పెట్టాడు అది షూట్ స్టార్ట్ అయింది.అయినప్పటికీ ఆ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు.ఇక దాంతో ఈ సినిమాని ఆపేసి నార్నే నితిన్ మాడ్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.మరి ఇప్పుడు శతమానం భవతి డైరెక్టర్ సతీష్ తో చేసే సినిమా షూటింగ్ జరుగుతుందా.? లేదా మధ్యలో ఆపేశారా.? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.