నటరాజ్ మాస్టర్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన బాలయ్య.. ఏం చేశారంటే?

తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని రియలిటీ షోలలో బిగ్ బాస్ షో ఒకటని చెప్పవచ్చు.

స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న ఈ షో మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకోవడంతో పాటు ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటుండటం గమనార్హం.

ఈ షో ద్వారా ఫేమస్ అయిన సెలబ్రిటీలలో బాలకృష్ణ ఒకరు.నటుడు కావాలని భావించి సినిమా రంగంలోకి వచ్చిన నటరాజ్ మాస్టర్ తర్వాత రోజుల్లో డ్యాన్సర్ గా మారారు.

భార్య గర్భవతిగా ఉన్న సమయంలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నటరాజ్ మాస్టర్ ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన మేల్ కంటెస్టెంట్లలో ఒకరు కావడం గమనార్హం.బిగ్ బాస్ హౌస్ లో వివాదాల ద్వారా, విమర్శల ద్వారా నటరాజ్ మాస్టర్ వార్తల్లో నిలిచారు.

అయితే బిగ్ బాస్ నటరాజ్ మాస్టర్ కెరీర్ కు ప్లస్ అయిందని ఈ షో తర్వాత నటరాజ్ మాస్టర్ కు ఆఫర్లు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని సమాచారం.

Nataraj Master Got Balakrishnas Unstoppable With Nbk Show,nataraj Master , Balak
Advertisement
Nataraj Master Got Balakrishnas Unstoppable With Nbk Show,nataraj Master , Balak

బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో ప్రసారం కానున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో నటరాజ్ మాస్టర్ బాలయ్యతో స్టెప్పులు వేయించారని తెలుస్తోంది.బాలకృష్ణ, నటరాజ్ మాస్టర్ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది.బాలయ్యతో నటరాజ్ మాస్టర్ ఎలాంటి స్టెప్పులు వేయించారో చూడాల్సి ఉంది.

భవిష్యత్తులో బాలయ్య సినిమాలకు కూడా నటరాజ్ మాస్టర్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.బిగ్ బాస్ షో నటరాజ్ కెరీర్ కు ప్లస్ కావడంతో ఆయన అభిమానులు కూడా సంతోషిస్తున్నారు.

దీపావళి పండుగ రోజైన నవంబర్ 4వ తేదీ నుంచి ఈ షో ప్రసారం కానుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు