విశ్వంలోని దెయ్యం చేతి చిత్రాలను షేర్ చేసిన నాసా..

నాసా( NASA ) తన ఎక్స్-రే టెలిస్కోప్‌లు చంద్ర, IXPE ద్వారా తీసిన ఒక కాస్మిక్ హ్యాండ్ అద్భుతమైన చిత్రాన్ని విడుదల చేసింది.

ఇమేజ్‌ మధ్యలో పల్సర్ నుంచి విస్తరించి, నాలుగు వేళ్లతో మానవ చేతిని పోలి ఉండే ఒక బ్రైట్ పర్‌పుల్ నెబ్యులాను చూపుతుంది.

PSR B1509-58 అని పేరు పెట్టిన పల్సర్ ఒక స్పిన్నింగ్ న్యూట్రాన్ స్టార్, ఇది దాని ధ్రువాల నుంచి పదార్థం, శక్తి శక్తివంతమైన కిరణాలను విడుదల చేస్తుంది.ఈ ఇమేజ్ చూస్తుంటే విశ్వంలోని ఒక దెయ్యం చేతి లాగానే ఉందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

Nasa Shared Images Of The Devils Hand In The Universe , Nasa, Cosmic Hand, X-ray

పల్సర్ అయస్కాంత క్షేత్రం, గాలి ద్వారా క్రియేట్ అయిన శక్తివంతమైన కణాల మేఘాన్ని MSH 15-52 నెబ్యులా( Nebula msh 15-52 ) అని పిలుస్తారు.పల్సర్, నెబ్యులా భూమి నుంచి 16,000 కాంతి సంవత్సరాల దూరంలో సర్సినస్ కూటమిలో ఉన్నాయి.విభిన్న సామర్థ్యాలను కలిగి ఉన్న రెండు ఎక్స్-రే అబ్జర్వేటరీలు చంద్ర, IXPE నుంచి డేటాను కలపడం ద్వారా ఈ ఇమేజ్ క్రియేట్ చేయడం జరిగింది.

చంద్ర అధిక-శక్తి X-కిరణాలను గుర్తించగలదు, అయితే IXPE X-కిరణాల పోలరైజేషన్ కొలవగలదు.ఈ రెండు రకాల డేటాను కలపడం ద్వారా, ఖగోళ శాస్త్రవేత్తలు కాస్మిక్ హ్యాండ్ నిర్మాణం, మూలం గురించి మరింత తెలుసుకోవచ్చు.

Nasa Shared Images Of The Devils Hand In The Universe , Nasa, Cosmic Hand, X-ray
Advertisement
NASA Shared Images Of The Devils Hand In The Universe , NASA, Cosmic Hand, X-ray

అధ్యయనానికి నాయకత్వం వహించిన కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ( Stanford University )కి చెందిన రోజర్ రోమాని ప్రకారం, పల్సర్ అయస్కాంత క్షేత్ర రేఖల వెంట ప్రయాణించే చార్జ్డ్ కణాల ద్వారా ఎక్స్-కిరణాలు ఉత్పత్తి అవుతాయని డేటా చూపిస్తుంది.అతను దానిని మానవ చేతి ఎముకలతో పోల్చాడు.అలాగే మనకు కనిపించకుండా దాగిన ఇలాంటి వస్తువులను అధ్యయనం చేసేందుకు ఎక్స్ రేలు ఉపయోగపడతాయన్నారు.

ఓరి దేవుడో.. జంతువులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. (వీడియో)
Advertisement

తాజా వార్తలు