నరేష్, పవిత్ర కలిసే ఉన్నారు.. ఎట్టకేలకు సస్పెన్స్ కి తెర పడింది

సీనియర్ నటుడు నరేష్‌ గత కొన్నాళ్లుగా పవిత్ర లోకేష్ తో సహజీవనం సాగిస్తున్నాడు అనే విషయం తెల్సిందే.

అయితే ఆ మధ్య నరేష్ యొక్క మూడవ భార్య మీడియా ముందుకు వచ్చి తనతో విడాకులు కాకుండానే పవిత్ర తో అక్రమ సంబంధం ను నరేష్ కొనసాగిస్తున్నాడు అంటూ రచ్చ చేసిన విషయం తెల్సిందే.

ఆ దెబ్బ తో పవిత్ర కి నరేష్ దూరం అయ్యాడు అంటూ వార్తలు వచ్చాయి.గత కొన్ని రోజులుగా వీరిద్దరు కలిసి మీడియా ముందుకు రాలేదు.

మీడియా లో కనిపించలేదు.కనుక వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారా అనే వార్తలకు బలం చేకూరినట్లు అయ్యింది.

కాని ఇటీవల కృష్ణ మృతి నేపథ్యం లో నరేష్ అన్ని తానై చూసుకున్నారు.ఆ క్రమంలోనే పవిత్ర లోకేష్ కూడా వచ్చారు.

Advertisement

మొదట ఆసుపత్రి వద్దకు నరేష్ తో కలిసి పవిత్ర లోకేష్ వచ్చారు.ఆ తర్వాత పద్మాలయ స్టూడియోస్ వద్దకు కూడా పవిత్ర లోకేష్ ను వెంట పెట్టుకుని మరీ నరేష్ వచ్చారు.

ఇద్దరు కలిసి అక్కడ సందడి చేశారు.

నరేష్‌ మూడవ భార్య వచ్చి కృష్ణ పార్ధివ దేహానికి నివాళ్లు అర్పించి వెళ్లిన వెంటనే నరేష్ తన తో పాటు పవిత్ర లోకేష్ ను తీసుకు రావడం జరిగింది.నరేష్ మరియు పవిత్ర లోకేష్ చాలా అన్యోన్యంగా కలిసి రావడం తో వారి యొక్క బ్రేకప్‌ వార్తలు నిజం కాదని తేలిపోయింది.తన యొక్క మూడవ భార్య తో విడాకులు కన్ఫర్మ్‌ అయిన తర్వాత పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకునే ఉద్దేశ్యం తో నరేష్ ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.సీనియర్ నటుడు నరేష్ మరియు పవిత్ర లోకేష్ లు పద్మాలయ స్టూడియోస్ వద్ద చాలా అన్యోన్యంగా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని చెట్టాపట్టాలేసుకుని తిరగడం అందరి దృష్టిని ఆకర్షించింది.

అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?
Advertisement