సొంత ప్రభుత్వంపై ఆ పార్టీ ఎం‌పి విమర్శలు

నరసాపురం వైసీపీ ఎం‌పి రఘు రామ కృష్ణం రాజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మరో సారి విమర్శలు చేశాడు.

తాజాగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల గ్రామంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలో ఒక్కటైన రామతీర్థం ఆలయంలోనికి నిన్న రాత్రి కొంత మంది దుండగులు ప్రవేశించి శ్రీ రాముడి విగ్రహాన్ని ద్వంసం చేశారు.

ఈ విషయంపై భారత ప్రదాని నరేంద్ర మోడీకి వైసీపీ ఎం‌పి లేఖ రాశారు.వైసీపీ ఏపీ లో అధికారంలోకి వచ్చి 18 నెలలు అవ్వుతుంది.

ఇప్పటి వరకు 100 కు పైగా రాష్ట్రంలోని హిందూ దేవాలయాల పైన దాడులు జరిగాయని.మరో మూడు ఆలయాల్లో రథాలను కాల్చి వేశారని, జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే హిందూ ఆలయాల పైన దాడులు జరుగుతున్నాయి, ప్రభుత్వంకు ఎదురు తిరిగి మాట్లాడిన హిందువుల పైన కేసులు పెడుతున్నారని రఘు రామ కృష్ణం రాజు గుర్తు చేశాడు.

జగన్ పుట్టిన రోజున మాత్రం ర్యాలీలు, బర్త్ డే వేడుకలు అంటూ వైసీపీ నాయకులు హడావుడి చేశారు.రామతీర్థం లో రాముడి విగ్రహం ద్వంసం చేస్తే హిందువులు నిరసన తెలపకుండా అడ్డుపడుతూ.కరోనా వైరస్ ను సాకుగా చూపిస్తున్నారని ఆరోపించాడు.

Advertisement

హిందు ఆలయాలపై దాడులు జరుగుతున్నా నేపథ్యంలో తక్షిణమే కేంద్ర బృందాలను పంపి విచారణ జరపాలని ఆయన కోరాడు.ఈయన గతంలో కూడా జగన్ పై ఆరోపణలు చేశాడు.

వైసీపీ పార్టీ నాయకుల నుండి కార్యకర్తల నుండి తనకు త్రెట్ ఉందని తనకు రక్షణ కల్పించాలని గతంలో కేంద్రం ను కోరిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు