2024 ఏపీ ఎన్నికలలో అత్యధిక మెజారిటీ నారా లోకేష్ దే..!!

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిచిన అభ్యర్థి నారా లోకేష్( Nara Lokesh ).మంగళగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నారా లోకేష్ 91 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు.

2024 ఏపీ ఎన్నికలలో ఇదే అత్యధిక మెజారిటీ.2019 ఎన్నికలలో లోకేష్ మంగళగిరిలో దారుణంగా ఓడిపోయారు.తండ్రి చంద్రబాబు( Chandrababu ) ముఖ్యమంత్రిగా ఉన్నాగాని లోకేష్ ఓడిపోవడంతో ప్రత్యర్థులు దారుణంగా ట్రోల్ చేశారు.

అయినా గాని లోకేష్ నిరాశ చెందకుండా ఓడిన మంగళగిరి నియోజకవర్గంలోని ఈసారి అత్యధిక మెజారిటీతో గెలిచి తన సత్తా చాటారు.ఓడిపోయిన గాని మంగళగిరిలో( Mangalagiri ) నిత్యం పర్యటనలు చేస్తూ స్థానిక ప్రజలకు సాయం చేస్తూ.

వాళ్ల ఆదరణ పొందుకున్నారు.

Nara Lokesh Will Get The Highest Majority In Ap Elections , Tdp, Nara Lokesh, Ap

ప్రతి నెల నియోజకవర్గంలో పర్యటిస్తూ తన దృష్టికి వచ్చిన అనేక సమస్యలపై స్పందించారు.ఈసారి ఎన్నికల ప్రచారం సమయంలో మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ అత్యధికంగా పర్యటించడం జరిగింది.మంగళగిరిలో టీడీపీ గెలిచిన సందర్భాలు చాలా తక్కువ.

Advertisement
Nara Lokesh Will Get The Highest Majority In AP Elections , TDP, Nara Lokesh, AP

అయినా అటువంటి కష్టమైన నియోజకవర్గంలో పోటీకి నిలబడి మొదటిసారి ఓడి.రెండోసారి రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో లోకేష్ గెలవడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.చంద్రబాబు జైల్లోకి వెళ్లిన సమయంలో అంతకుముందు పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పెరిగేలా లోకేష్ రాణించారు.

గతంలో కంటే రాజకీయంగా లోకేష్ ఎదగటం ఇప్పుడు అత్యధిక మెజారిటీతో గెలవడంతో.కుటుంబ సభ్యులు సైతం చాలా సంతోషంగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు