ఏపీ రాజధాని అమరావతే స్పష్టం చేసిన నారా లోకేష్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం ( TDP )కూటమి ఘన విజయం సాధించటం తెలిసిందే.164 అసెంబ్లీ, 21 పార్లమెంట్ స్థానాలను కూటమి గెలుచుకోవడం జరిగింది.

గత ఎన్నికలలో ఓడిపోయిన లోకేష్ ఈసారి ఎన్నికలలో గెలవడం జరిగింది.

అదే మంగళగిరి నియోజకవర్గం నుండి 90 వేలకు పైగా మెజారిటీతో గెలిచారు.ఈ క్రమంలో లోకేష్( Nara Lokesh ) శుక్రవారం జాతీయ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది.

ఈ సందర్భంగా రాజధాని గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని అని స్పష్టం చేశారు.ఈ విషయంలో మరో ఆలోచన లేదని అన్నారు.2014-19 మధ్య అమరావతిని కొంతమేర నిర్మించాం.

రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాం.కానీ అధికారం కోల్పోవడం వల్ల పూర్తి చేయలేకపోయాం.ప్రస్తుతం అమరావతి( Amaravati )ని పునర్ నిర్మించే పనిలో ఉన్నాం.

Advertisement

మూడు రాజధానుల ముచ్చట ఇక ముగిసినట్లే అని లోకేష్ స్పష్టం చేయడం జరిగింది.గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అని పేర్కొనడం జరిగింది.

అభివృద్ధి అంతటా జరగాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు.కానీ తెలుగుదేశం మాత్రం మొదటినుండి అమరావతి యే ఏకైక రాజధాని అని వ్యవహరిస్తూ ఎన్నికల ప్రచారంలో కూడా ఈ రకంగానే రాణించారు.

ఇప్పుడు గెలవటంతో ఏపీకి అమరావతి ఏకైక రాజధాని అని జాతీయ మీడియా ఇంటర్వ్యూలో నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 
Advertisement

తాజా వార్తలు