ఈ ఫోటోలో ఉన్న పాప ఎవరో గుర్తుపట్టారా?

ఈ ఫోటోలో ఉన్న పాప ఎవరో గుర్తుపట్టారా? ఇంకెవరండీ.నాన్న సినిమాలో విక్రమ్ కూతురుగా నటించి అందరి కంట కన్నీళ్లు పెట్టించిన పాప.

ఈ పాప పేరు సారా అర్జున్.ముంబైకి చెందిన సారా అర్జున్ ఇప్పుడు అడ్వార్టైజ్ మెంట్స్ లో నటించింది.

Nanna Movie Fame Sara Arjun Latest Photos, Child Artist, Nanna, Tamil Movies, Sa

హిందీ, మలయాళం భాషల్లో ఎన్నో అడ్వేర్టైజ్ మెంట్స్ లో నటించిన ఈ భామ కేవలం యాడ్స్ ఏ కాదు సినిమాల్లో కూడా నటించింది.ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో వచ్చిన దైవ తిరుమగళ్ అనే తమిళ చిత్రంలో బాలనటిగా పరిచయం అయింది.ఇక ఇదే సినిమాను తెలుగులో నాన్న పేరుతో విడుదల చెయ్యగా ఎంతోమంది ఆమెకు ఫిదా అయ్యారు.

హీరో విక్రమ్ కూతురుగా తన ముద్దు ముద్దు మాటలతో, తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో తన నటనతో కంటతడి పెట్టించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నారి.ఈ సినిమా వల్ల తన నటనకు ఎంతో గుర్తింపు వచ్చింది.

Advertisement

హీరో రాజేంద్ర ప్రసాద్ తో కలిసి దాగుడు మూతలు దండాకోర్ సినిమాలో సారా అర్జున్ తన మనవరాలిగా నటించింది.ఈ చిన్నారి తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో బాల నటిగా నటించి మంచి పేరు దక్కించుకుంది.

చిన్న వయస్సులో పరిచయమైన ఈ పాప ఇప్పుడు ఎంతో పెద్దది అయ్యింది.ఎంతో అందంగా గ్లామర్ గా కనిపిస్తున్న ఈ పాప అందరినీ షాక్ అయ్యేలా చేసింది.

సారా అర్జున్ తండ్రి కూడా నటుడే.కొన్ని సినిమాల్లో నటించారు.

సారా అర్జున్ తన ఆరేళ్ల వయసులోనే భాష రాకపోయినా డైలాగ్స్ నేర్చుకొని మరీ తమిళ సినిమాల్లో నటించింది.ఇప్పటివరకు బాలనటిగా ఉన్న ఈ పాప త్వరలోనే హీరోయిన్ గా రాబోతుంది.

ఇలా ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలో అడుగుపెట్టిన వారు ప్రస్తుతం హీరో హీరోయిన్ గా నటిస్తూ మంచి పేరు దక్కించుకుంటున్నారు.అలాగే సారా అర్జున్ కూడా హీరోయిన్ గా మంచి స్థానం సంపాదిస్తుంది ఏమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు